Budget 2024: బడ్జెట్ వేళ నిర్మలమ్మ కొత్త రికార్డులు - కొత్త వరాలపై ఆశలు..!!
ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ పైన అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరికి వరాలు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు, పన్నుల్లో రాయితీలు, ధరల తగ్గింపు వంటి అంశాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో నిర్మలా సీతా రామన్ ఈ బడ్జెట్ ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. ఈ రోజు ప్రవేశ పెట్టే బడ్జెట్ ద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేస్తూ ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 1959 నుంచి 1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఇదే సమయం లో సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదన వేళ ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. 2020లో అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం రికార్డ్ క్రియేట్ చేశారు. 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించి రికార్డ్ నెలకొల్పారు. ఈ రోజు ఓట్ ఆన్ ఎకౌంట్ ద్వారా మూడు నెలల బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు.

మూడో సారి కూడా తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేసారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇందులో పెద్ద విధాన పరమైన మార్పులు, పెద్ద పెద్ద ప్రకటనలు చేయకపోవచ్చనే టాక్ కూడా నడుస్తోంది. అయినప్పటికీ.. ఎన్నికల సంవత్సరం కావడంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పు, పన్ను పరిమితి, సెక్షన్ 80సి, 80డి కింద పన్ను మినహాయింపులు, వేతన జీవులకు పన్ను మినహాయింపుల వంటి ప్రకటనల కోసం సామాన్యులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఎన్నికల సమయం కావటంతో ఖచ్చితంగా ప్రజలను తమ వైపు తిప్పుకొనేలా ప్రకటనలు ఉంటాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications