బిగ్ అలర్ట్- స్టాక్ మార్కెట్ స్పెషల్ సెషన్: నిలబెడుతుందా? కూల్చుతుందా?

Nirmala Sitharaman Saree: ఇంకొద్ది సేపట్లో.. వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ఉభయ సభల ముందుకు రాబోతోంది. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. సరిగ్గా ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించనున్నారు. సుమారు రెండుగంటల పాటు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది.

ఈ ఉదయం 8:30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన నిర్మల సీతారామన్.. నేరుగా తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సలహాదారు అనంత నాగేశ్వరన్, ఇతర అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. మర్యాదపూరకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరారు.

Budget 2025 Sensex up 220 pts Nifty also raises

రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు, వ్యవసాయం, రైల్వేలు, జాతీయ రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పన రంగాలకు భారీ మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. విద్య, వైద్యం, డిజిటల్ ఇండియా, పీఎంఏవై, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వాటికి కల్పించాల్సిన సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా శనివారం నాడు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ఉంటుంది. దలాల్ స్ట్రీట్‌లో ఎలాంటి లావాదేవీలు ఉండవు. ఇప్పుడు మాత్రం స్పెషల్ సెషన్ కొనసాగుతోంది.

ఈ ఉదయం 9:15 నిమిషాలకు స్టాక్ మార్కెట్లు గ్రీన్ సర్కుట్‌లో ఆరంభం అయ్యాయి. తొలి అరగంటలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. ఆ తరువాత స్వల్పంగా క్షీణించింది. 170-190 పాయింట్ల మధ్య కొంత సేపు ఊగిసలాడింది. అనంతరం ఒక్కసారిగా బూస్టప్ అయింది. ఉదయం 10:30 గంటల సమయానికి 225 పాయింట్లను టచ్ చేసింది సెన్సెక్స్.

ఆ తరువాత 220 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. అటు నిఫ్టీ కూడా పెరుగుదల బాటలోనే కనిపించింది. 50 పాయింట్లకు పైగా మెరుగుపడింది. ఒకదశలో 23,550 పాయింట్లను అందుకుంది. ఫలితంగా- బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ పాజిటివ్ సంకేతాలను పంపించినట్టయింది. బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+