థాయిలాండ్ ట్రిప్.. తక్కువ ధరకే.. IRCTC స్పెషల్ ఆఫర్..
ఓ వైపు చల్లటి వర్షాలు.. మరోవైపు సెలవులు.. థాయిలాండ్ ట్రిప్ వేయాలాని ఉందా..? అయితే మీకోసం IRCTC స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా తక్కువ ఖర్చుతోనే థాయిలాండ్ ట్రిప్ ను ఎంజాయ్ చేసే అవకాశం కల్పించింది. ఈ సీజన్ లో థాయిలాండ్ వెళ్తే న భూతో న భవిష్యతి లాగా ప్రకృతి అందాల్లో పరవశించిపోవచ్చు. ఉప్పొంగే జలపాతాలు, పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ సమయంలో థాయిలాండ్ ట్రిప్ సూపర్ ఉంటుందని చెబుతున్నారు. అందుకే IRCTC ప్రత్యేకంగా ఆఫర్ తీసుకొచ్చింది.
థాయిలాండ్ అంటేనే సహజ సౌందర్యం, అద్భుతమైన బీచ్ లకు కేరాఫ్ అడ్రస్ గా చెప్తారు. అలాగే ఇక్కడి సున్నపురాయి కొండలకు, చారిత్రక బౌద్ధ దేవాలయాలకు, సంస్కృతికి, రుచికరమైన స్థానిక వంటకాలకు, ఫ్రెండ్లీ ప్రజలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఏటా భారత్ నుంచి ఈ ప్రాంతానికి లక్షలాది మంది పర్యటకులు వెళ్తుంటారు. అందమైన ద్వీపాలు, తెల్లని ఇసుక బీచ్ లు, పచ్చని అడవులు, ఎత్తైన పర్వతాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. థాయిలాండ్ లో ప్రతీది ఆశ్చర్యమే అనేలా అనుభూతి ఉంటుంది.

అయితే తాజాగా IRCTC (Indian Railway Catering and Tourism Corporation) తక్కువ ధరకే థాయిలాండ్ తనివితీరా చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. పర్యటకులు విమానంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 4 వ తేదీ తిరిగి రావచ్చు. ఇది 4 రోజులు / 3 రాత్రులు టూర్. చెన్నై నుంచి బ్యాంకాక్ కు ఉంటుంది. ఈ ప్యాకేజీలో హోటల్ సదుపాయంతోపాటుగా డైలీ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తారు. ఒక వ్యక్తికి సగటుగా రూ. 49,500 ఉంటుంది. గ్రూప్ బుకింగ్ అయితే ధర తగ్గుతుంది.












Click it and Unblock the Notifications