VIRAL VIDEO:బుల్లెట్ రాణి, చీరతో బైక్ నడుపుతూ.. మరో లేడీ కూడా, వైరల్
డ్రైవ్ చేయడం అంటే అందరికీ ఇష్టం. బైక్, కారు.. ఏదైనా సరే కొన్నిరోజులు ఆసక్తి ఉంటుంది. ఆ తర్వాత తగ్గుతుంది. ఇక లేడీస్ అయితే స్కూటీ డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు కార్లు కూడా నడుపుతున్నారు అనుకో.. మరీ బుల్లెట్ బండి నడపడం రేర్. అలాంటిదీ ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది అదీ వైరల్ అవుతుంది. మరీ మీరు కూడా చూడండి.
బుల్లెట్ రాణి..
ఆ వీడియోలో మహిళ సాంప్రదాయ దుస్తులనే ధరించింది. వెనకాల మరొకరు కూడా ఉన్నారు. చక్కగా బుల్లెట్ బండి నడుపుతుంది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు బుల్లెట్ రాణి అని క్యాప్షన్ పెట్టారు. రాత్రిపూట వారు రోడ్డుపై ట్రావెల్ చేశారు. వెనకాల కూర్చొన్న మహిళ చీర కట్టుకోగా.. ముందు కూర్చొన్న మహిళ కూడా మంగెట్ట చీర ధరించింది. అదీ ఆరెంజ్ కలర్ చీర. బైక్ మీద ఉన్న ఇద్దరు కూడా తలపై కొంగు వేసుకొని ఉన్నారు.

నవ్వుతూ కనిపించిన మహిళలు
వారిద్దరూ వీడియోలో చూసి నవ్వుతూ కనిపించారు. వీడియోను ఇప్పటికే 60 వేల చాలాసార్లు చూశారు. వారిద్దరూ తలపై కొంగు కప్పుకోవడం కాస్త డైవర్షన్‌కి దారితీసింది. హెల్మెట్ కూడా పెట్టుకోవాలని సూచించారు. అదీ ఛాయిస్ కాదు.. తప్పనిసరి అని కామెంట్ చేశారు. ఆమెను చూస్తే తనకు గర్వంగా ఉందని మరొకరు రాశారు. మహిళా శక్తి బలీయమైనదని.. వారు ఏమైనా చేయగలరని మరొకరు రాశారు.
సమానమే
నిజమే.. మహిళలు తలచుకుంటే ఏదైనా చేస్తారు. ఇప్పటికీ పైలట్లుగా చాలా మంది రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా జాబ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బండ్లు నడుపుతూ.. లైఫ్ బండి నడిపేస్తున్నారు. చాలా మంది తమ ఇంటిని నెట్టుకొస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు భర్తలు పట్టించుకోకుంటే.. వారే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ బుల్లెట్ రాణి మాత్రం చక్కగా టూ వీలర్ నడిపేస్తోంది. డ్రైవ్ చేస్తూ మరీ స్మైల్ ఇచ్చింది. వెనకాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా వచ్చింది. మీరు ఆ వీడియో చూసి.. ఎంజాయ్ చేయండి.












Click it and Unblock the Notifications