Bundi Tour: రాజస్థాన్ లోని బుండి సిటీ టూర్ వెళ్లొద్దామా..?

భారత్ లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో రాజస్థాన్ ఒకటి. చారిత్రక కట్టడాలు, కోటలు, ఎడారి అందాలు చూడాలంటే రాజస్థాన్ కు రావాల్సిందే. అంబర్ కోట, హవా మహల్, జైపూర్ పింక్ సిటీ అందాలు ఇలా అనేక టూరిస్ట్ ఎట్రాక్షన్స్ కు రాజస్థాన్ నెలవుగా ఉంది. అలాగే రాజస్థాన్ మరో చూడదగ్గ ప్రదేశంగా బుండి అనే చిన్న పట్టణం కూడా ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ లో ఇక్కడకు వెళ్తే మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఇళ్లన్నీ బ్లూ కలర్ పెయింట్ తో నిండి ఉంటాయి. మెట్ల బావులు, చారిత్రక ప్రదేశాలు ఇక్కడ చాలా ఫేమస్ గా ఉంటాయి. రాజస్థాన్ లోని హడోటీ ప్రాంతంలో ఆరావళి కొండల మధ్య ఈ బుండి ప్రాంతం ఉంది. బుండి పర్యాటక ప్రాంతంలో ఇతర ప్రదేశాలు చూస్తే.. కేవ్ పెయింటింగ్స్ చాలా ఫేమస్. రాతియుగం నాటి గుహల్లో చిత్రాలు అబ్బుర పరుస్తాయి.

ఘర్హ్ ప్యాలెస్, తారాఘడ్ ఫోర్టు, చిత్రశాల- ఉమ్మెడ్ మహాల్, రంజిని కీ బోరీ, మెట్ల బావులు, గీత్ ఆర్ట్ అండ్ జ్యువెలరీ, బుండీ పెయింటింగ్స్, ధబాయ్ కుంద్, రామ్ గర్హ్ విషాధారీ టైగర్ రిజర్వ్, నవాల్ సాగర్, ఇంద్రాఘడ్ ఫోర్ట్, సుక్కి నివాస్ మహల్, బిజాసన్ మాతా ఆలయం, శ్రీ కృష్ణ ఆర్ట్ అండ్ ఆంటిక్స్, చౌరాసీ, భోరాజీ కా కుంద్, సబ్జీ మందీ, ఛత్రా మహల్, పాంఛాల్ జ్యూవెలరీ, జైత్ సాగర్ లేక్ తదితర ప్రాంతాలు బుండి టౌన్ లో చాలా ఫేమస్. వీటితో పాటు నగర్ సాగర్ కుంద్, రామ్ గఢ్ విశధారి శాంక్చూరీ, బదల్ మహాల్, శిఖార్ బుర్జ్, హతియా పోల్, కుసుమ్ ఆర్ట్ జ్యువెలరీ, ఫూల్ సాగర్ లేక్, ధూలేశ్వర్ మహదేవ్ టెంపుల్, కనక్ సాగర్ లేక్ టూరిస్ట్ ప్రాంతాలు కూడా చాలా ఫేమస్..

Bundi Highlights of a tour Rajasthan How to get there from Hyderabad Here are the full details

ఇక హైదరాబాద్ నుంచి బుండి ఎలా చేరుకోవాలంటే..? హైదరాబాద్ నుంచి రాజస్థాన్ లోని బుండి నగరానికి సుమారు 1,150 కిలోమీటర్ల దూరం ఉంది. బుండి పట్టణానికి డైరెక్ట్ గా విమాన సర్వీసులు లేవు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి వెళ్లాలి. హైదరాబాద్ నుంచి జైపూర్ కు విమానంలో 2 గంటలు పడుతుంది. జైపూర్ విమానాశ్రయం నుంచి బుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. లేదంటే కాచీగూడ నుంచి రైలు మార్గంలో జైపూర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి బుండి ప్రాంతాన్ని సందర్శించొచ్చు. ఇక సొంత వాహనం కలిగిన వారు హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ అక్కడి నుంచి ఇటార్సి.. ఆ తర్వాత భోపాల్, కోటా మీదుగా బుండి ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+