భార్యపై అక్రమ సంబంధం అనుమానం: గొంతుకోసి హత్య..తానూ ఉరి వేసుకున్న క్యాబ్ డ్రైవర్..!

బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యపై ప్రవర్తనపై అనుమానాన్ని పెంచుకున్న ఓ క్యాబ్ డ్రైవర్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసం హతమార్చాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరు జేపీ నగర సమీపంలోపి పుట్టెనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుల పేర్లు మురుగేష్. వాసంతి. తమిళనాడుకు చెందిన వారిద్దరూ ఏడేళ్ల కిందట పుట్టేనహళ్లిలో స్థిరపడ్డారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మురుగేష్ క్యాబ్ డ్రైవర్ గా పని చేసేవాడు. ఆయన భార్య వాసంతి స్థానికంగా ఓ గార్మెంట్స్ తయారీ కర్మాగారంలో రోజువారీ కార్మికురాలిగా జీవనాన్ని కొనసాగించే వారు. కొంతకాలంగా వాసంతి ప్రవర్తనపై మురుగేష్ లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

 Cab driver kills his wife over affair suspicion, hangs self after

గార్మెంట్స్ తయారీ పరిశ్రమలో తోటి ఉద్యోగితో ఆమె అక్రమ సంబంధాన్ని పెట్టుకుందనే అనుమానం మురుగేష్ ను పట్టి పీడిస్తుండేది. ఇదే విషయంపై మురుగేష్ తరచూ భార్యతో గొడవ పడుతుండే వాడు. ఆమెను కొడుతుండేవాడు. అతని వేధింపులను భరించలేక వాసంతి తన భర్తపై పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. దీనితో అతని ఆగ్రహం మరింత పెరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

 Cab driver kills his wife over affair suspicion, hangs self after

మద్యం సేవించి వచ్చిన మురుగేష్ కూరగాయలు తరిగే కత్తితో వాసంతిపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసం హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఉదంతాన్ని చూసిన చుట్టు పక్కల వారు పుట్టెనహళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మురుగేష్, వాసంతి పిల్లలు అనాథలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+