బెంగళూర్లో మరో నిర్భయ: వ్యాన్‌లో తిప్పుతూ 2 గంటలు గ్యాంగ్‌రేప్
బెంగళూరు: మూడేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయ పైన జరిగిన అత్యాచారం తరహా బెంగళూరులో తాజాగా జరిగింది. ఓ కాల్ సెంటర్‌లో పని చేసే ఉద్యోగిని పైన కదులుతున్న వ్యానులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో... ఓ చోట పడేసి వెళ్లిపోయారు.
బిపివోలో పని చేసే యువతిని మోసం చేసి వ్యానులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్ సోమవారం రాత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు.
26 ఏళ్ల బాధితురాలి స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. హోసూరు మార్గంలో మడివాళ సమీపంలోని ఇంటి నుంచి బాధితురాలు దొమ్మలూరులో తాను పనిచేసే కాల్‌సెంటర్‌కు వెళ్లడానికి శనివారం రాత్రి 9.30 గంటలప్పుడు బస్టాప్‌కు చేరుకుంది.

కాసేపటికే అక్కడకు ఓ వ్యాన్ వచ్చింది. ఇది కాల్‌సెంటర్ ఉద్యోగులను కార్యాలయానికి తరలించే వాహనాన్ని పోలి ఉంది. ఆ కారు డ్రైవర్ ఆమెను పలుకరించి, దొమ్మలూరులోని కాల్‌సెంటర్‌కే వెళ్తున్నట్లు నమ్మబలికాడు.
ఆమె వాహనంలోకి ఎక్కింది. అందులో మరో ఇద్దరు యువకులు ఉండటాన్ని ఆమె గుర్తించింది. అనుమానం వచ్చి ఆమె అప్రమత్తమయ్యేలోపే, కామాంధులు దారుమానికి ఒడిగట్టారు. బెంగళూరు వీధుల్లో చక్కర్లు కొడుతూ వాహనంలోనే ఆమెపై వరుస లైంగిక దాడులకు దిగారు.
రెండు గంటల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. అపస్మారక స్థితిలోకి చేరడంతో, భయంతో దొమ్మలూరులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో కిందకు తోసేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో కొందరు ఆటోవాలాలు ఆమెను చూసి ఆస్పత్రికి తరలించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు పూర్తిస్థాయిలో స్పందించే స్థితిలో లేకపోవడంతో అన్ని వివరాలు తెలియరాలేదని పోలీస్ కమిషనర్ చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని, దుండగులను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications