Sara Alikhan at Cannes: కుర్రాళ్లను కట్టిపడేసిన సారా...మైండ్ బ్లాక్ అంతే..!
Sara Alikhan: కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అందమైన భామలు ఒక్కొక్కరుగా మెరుస్తున్నారు. అందమంతా ఒక్క చోటే ఉందా అనిపించేలా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక భారత్ నుంచి కూడా పలువురు బ్యూటీస్ రెడ్ కార్పెట్ పై దర్శనమిస్తున్నారు. బాలీవుడ్ భామలు ధరించిన ఫ్యాషన్ వేర్‌పై నెటిజెన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరు జబర్దస్త్‌గా ఉన్నారంటూ కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇక తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బాలీవుడ్ భామ సారా అలీఖాన్ తన అటైర్‌తో అలరించింది.మొన్న దేశీ లుక్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... రెండో రోజున మాత్రం ఫ్యాషన్‌గా కట్టిన చీరలో ప్రత్యక్షమైంది. మోనోక్రోమ్ బ్లౌజ్ ధరించి బొడ్డుకింద చీర కట్టి కొంగును చేతి చుట్టూ తీసుకొచ్చి చాలా స్టయిలిష్‌గా కనిపించింది. సారాను ఇలా చూసిన కుర్రాళ్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారంటే నమ్మండి.

ఇక చీరకు మ్యాచింగ్‌గా పెర్ల్స్‌తో కూడిన నెక్ పీస్ ధరించింది. ఇక హెయిర్‌ను చాలా స్టయిలిష్‌గా బన్‌లా చుట్టేసింది.కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తొలిసారిగా రెడ్ కార్పెట్ పై వాక్ చేస్తున్న సారా అలీఖాన్ తన బ్యూటీతో మెస్మరైజ్ చేస్తోంది. సారా ధరించిన డిజైనర్స్‌ను డిజైన్ చేసింది అబు జానీ-సందీప్ ఖోస్లా.సారా అలీఖాన్ ట్రెండీ వేర్‌లో ఉన్న ఫోటోలను ఇన్స్‌టాలో పోస్టు చేయగానే ఫోటోస్ వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తన మాజీ భార్య అమృత సింగ్‌లకు సారా అలీఖాన్ జన్మించింది.2018లో కేదార్‌నాథ్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ భామ. తర్వాత రణవీర్ సింగ్ సరసన సింబా,కార్తీక్ ఆర్యన్ సరసన లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ 1 చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం జరా హట్కే, జరా బచ్కే చిత్రంలో విక్కీ కౌశల్ సరసన నటిస్తోంది.ఆయే వతన్, మేరే వతన్ చిత్రంతో పాటు అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న మెట్రో ఇన్ డీనో మూవీ చేస్తోంది.












Click it and Unblock the Notifications