Urvashi Rautela:పింక్ అటైర్‌లో ఊర్వశీ..స్వర్గం నుంచి దిగొచ్చినట్లే..కానీ ట్రోలింగ్..!
Urvashi Rautela:కాన్స్ ఫిలింఫెస్టివల్ 2023 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.ఇక తొలిసారిగా పలువురు బాలీవుడ్ భామలు కాన్స్ రెడ్ కార్పెట్ పై దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగానే అందాల భామ ఊర్వశీ రౌటేలా స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను అలరించింది.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఊర్వశీ రౌటేలాను చూస్తే నిజంగా స్వర్గం నుంచి వచ్చిన ఊర్వశీలా ఉంది. ఆ అందాన్ని చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు. తొలిరోజున హాట్ పింక్ ఫర్రీ గౌన్‌లో చాలా హాట్‌గా కనిపించింది ఈ బాలీవుడ్ బ్యూటీ.అయితే ఊర్వశీ కాన్స్ ఫెస్టివల్‌లో అడుగుపెట్టగానే అందరి కళ్లు ఆమె కంఠంపై పడ్డాయి. అక్కడే అందరూ ఫోకస్ చేశారు.

ఊర్వశీ మెడలో ఒక నెక్ పీస్ చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది.ఆమె ధరించిన నెక్లెస్ ఒక మెసలి లేదా బల్లిని పోలి ఉంది.ఒకరి కళ్లల్లో పడాలంటే తనలో తానే ఒక ప్రత్యేకత చాటాలనుకుంది కాబోలు.. అందుకే స్పెషల్ అట్రాక్షన్‌గా క్రొకడైల్ నెక్లెస్ ధరించింది. ఇది చూసిన నెటిజెన్లు ఆగుతారా.. ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఎంతో అందంగా కనిపిస్తున్న నువ్వు.. మెడలో ఆ బల్లులు, మొసళ్లు వ్రేలాడతీసుకోవడం ఏంటి..? అని ప్రశ్నించారు. మరొకరైతే ఫ్యాషన్ వెర్రితో నిజంగానే బల్లిని మెడచుట్టూ వేసుకుని వచ్చిందేమో అని అనుకున్నట్లు పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే గతంలో కూడా ఊర్వశీ రౌటేలా పలు సందర్భాల్లో ట్రోలింగ్‌కు గురైంది. క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారంలో ట్రోలింగ్‌కు గురైంది. సన్నీడియోల్ హీరోగా నటించిన సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ భామ ఆ తర్వాత భాగ్ జానీ,సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ-4,పాగల్ పంతి లాంటి చిత్రాల్లో మెరిసింది. తమిళ, తెలుగు, కన్నడ,బెంగాళీ చిత్రాల్లో కూడా నటించింది.












Click it and Unblock the Notifications