బిల్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది: కారు సర్వీసింగ్‌కు బిల్లు ఎంత వేశాడో తెలుసా..?

ముంబై: సాధారణంగా వాహనాలు కొన్న తర్వాత రెండు నెలలకో లేదా కొన్ని కిలోమీటర్లు తిరిగాక బండిని సర్వీసింగ్‌కు పంపిస్తాం. సర్వీసింగ్ ఛార్జ్ సాధారణంగానే ఉంటుంది. కానీ వాహనం కొన్న కొత్తలో ఒక మూడు సర్వీసింగ్‌లను ఉచితంగానే చేసిస్తుంది వాహనం కంపెనీ. ఆ తర్వాత వెళ్లే సర్వీసింగులకు ఛార్జ్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముంబైలో మాత్రం ఓ సర్వీసింగ్ సెంటర్ ఒక వాహనదారుడికి వేసిన అంచనా బిల్లు చూశాకా కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతకీ ఆ సర్వీస్ సెంటర్ ఆ కారుకు వేసిన బిల్లు ఎంతో తెలుసా రూ.1.68 లక్షలు. ఏంటీ.. మీరు కూడా షాక్ అయ్యారా... అయితే ఈ వార్తను చదవండి.

Car dealer dupes customer by charging Rs.1.68 lakh for servicing

ప్రముఖ కార్ల కంపెనీ స్కోడాకు అనుబంధ సర్వీసింగ్ సెంటర్‌గా వ్యవహరిస్తున్న ముంబైలోని ఆటోబాన్ అనే సర్వీసింగ్ సెంటర్ ఒక కారు యజమానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.ఆగష్టు 16న కారు పాడైపోయింది. దాన్ని మెకానిక్ పరిశీలించిన తర్వాత డీలర్ ఒకేసారి రూ.1.68 లక్షల అంచనా బిల్లు వేశారు. అందులో రూ.1.43 లక్షల బిల్లు విడిభాగాలకు వేయగా... రూ.25వేలు లేబర్ ఛార్జిగా వేశారు. దీంతో ఆమె షాక్‌కు గురయ్యారు. కారు యజమానురాలకు కార్లపై కొంత అవగాహన ఉంది. డీలర్ ఏదో మోసం చేస్తున్నాడని గ్రహించి తన కారును తీసుకెళ్లింది.

Car dealer dupes customer by charging Rs.1.68 lakh for servicing

ఇక కారును మరో సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలని భావించి తన కారును తీసుకెళతానని చెప్పగా... అందుకు డీలర్ అడ్డు పడ్డాడు. కారు భాగాలన్ని బయటకు తీశామని తిరిగి బిగించేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆ మహిళ రూ. 3వేలు చెల్లించి ఆమె కారును అక్కడి నుంచి తీసుకెళ్లి మరో సర్వీస్ సెంటర్లో చూపించింది. అక్కడికి తీసుకెళ్లాక కారును రిపేర్ చేసి కారు తాళాలు ఆ మహిళ చేతికి ఇచ్చాడు మెకానిక్. బిల్లు ఎంతైందో చెప్పమని అడుగగా ఇక్కడ కూడా ఆమెకు షాక్ తగిలింది. స్కోడా సర్వీస్ సెంటర్ వాడు రూ. లక్ష బిల్లు వేయగా... కొత్త సర్వీస్ సెంటర్ మెకానిక్ కేవలం రూ. 1000 మాత్రమే బిల్లు వేశాడు. దీంతో షాక్ తిన్న ఆ యజమానురాలు ఆ మెకానిక్‌కు మరో రూ.500 సంతోషంగా చేతిలో పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+