తుపాకీతో బెదరించి ఫార్చూనర్ కారును ఎత్తుకెళ్లారు (వీడియో)

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై ఓ వ్యక్తి తలకు తుపాకీ పెట్టి.. అతని టయోటా ఫార్చూనర్ కారును ఎత్తుకెళ్లారు. దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. కారు యజమానికి తుపాకీ గురిపెట్టి కారును తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

నైరుతి ఢిల్లీలోని కాంటోన్మెంట్ ప్రాంతంలో తుపాకీ గురిపెట్టి 35 ఏళ్ల వ్యక్తి నుంచి కారును దొంగిలించారు. శనివారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ కు సమీపంలోని ఝరేరా ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 Carjacking at gunpoint in Delhi Cantt area: Caught on camera

జాతీయ రహదారి-8పై ఈ దోపిడీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఎరుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి కారు యజమానిని తుపాకీతో బెదిరించడం కెమెరాల్లో రికార్డయ్యింది. కారు యజమాని దగ్గర నుంచి కారు తాళాలు తీసుకుని అక్కడ్నుంచి ముగ్గురు నిందితులు కారుతో పరారయ్యారు.

కారు యజమాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+