భార్య పర్సనల్ ఫోటోలు, వీడియోలు ప్రపంచం మొత్తం చూపించిన పోలీసు ఇన్స్ పెక్టర్, తరువాత ?
బెంగళూరు/న్యూఢిల్లీ: పోలీసు అధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో యువతి వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తరువాత దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కూతురు పుట్టిన తరువాత పోలీసు అధికారి అసలు స్వరూపం చూపించాడని తెలిసింది. భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసిన పోలీసు అధికారి ఆమె జీవితంతో చెలగాటం ఆడటం కలకలం రేపింది.
ఇన్‌స్టాగ్రామ్ లో భార్య పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి, భార్య వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసి ఆమెను చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ మీద బెంగళూరులోని యలహంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యలహంక బాబానగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ శ్రావణకుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

2006లో శ్రావణకుమార్‌తో తన వివాహం అయ్యిందని, మాకు 13 ఏళ్ల కుమార్తె ఉందని బాధితురాలు యలహంక పోలీసులకు చెప్పింది. పెళ్లి తరువాత మా కాపురంలో గొడవలు మొదలైనాయని, తరువాత తన భర్త శ్రావణకుమార్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడని బాధితురాలు ఆరోపించింది. కేసు కోర్టులో విచారణలో ఉందని, అయితే శ్రావణకుమార్ నన్ను మానసికంగా హింసిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.
తన పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ సృష్టించిన తన భర్త శ్రావణకుమార్ నా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది.2023 జూలై నెలలో తన శ్రావణకుమార్ బెంగుళూరుకు వచ్చి తనను కలిసి చర్చలు జరిపాడని, తన కూతురు భవిష్యత్తు గురించి చర్చించాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

ఆ సందర్బంలో తనకు తెలియకుండా కూల్ డ్రింక్ లో మద్యం, మత్తు మందు కలిపి తనకు తాపించాడని, మత్తులోకి తాను జారుకున్న తరువాత తాను అశ్లీలంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియో తీసి నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకపోతే తనను, నా కుమార్తెను, తన తల్లిదండ్రులను చంపేస్తామని తన భర్త శ్రావణకుమార్ బెదిరించాడని,
అతని వల్ల మా కుటుంబానికి ప్రాణభయంతో ఉందని, అందువల్ల మాకు రక్షణ కల్పించాలని, తన భర్త మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ ఫిర్యాదులో అభ్యర్థించింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు అధికారులు తెలిపారు. భార్య నగ్న ఫోటోలు, వీడియోలను ఓ పోలీసు అధికారి సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications