ఐటీ షాక్ తర్వాత క్యాష్ బ్యాగ్..మహా మంత్రి వీడియో వైరల్!
మహారాష్ట్ర మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ శిర్సాత్ పడక గదిలో సిగరెట్ తాగుతూ.. ఆయన పక్కనే డబ్బుతో నిండి ఉన్న బ్యాగ్ తెరిచి ఉన్న వీడియో ఒకటి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పక్కన మరో సూట్‌కేస్ కూడా కనిపిస్తోంది. ఈ వీడియోను శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ షేర్ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని గమనించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
సంజయ్ రౌత్ ఆరోపణలు.. సంజయ్ శిర్సాత్ వివరణ
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సంజయ్ రౌట్ వీడియోను షేర్ చేస్తూ.. "ఈ థ్రిల్లింగ్ వీడియోను గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చూడాలి! దేశంలో ఏం జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రికి చెందిన ఈ వీడియో చాలా విషయాలు చెబుతోంది" అని రాశారు.

సంజయ్ రౌత్ ఆరోపణలపై మంత్రి సంజయ్ శిర్సాత్ వివరణ ఇచ్చారు. తనను ఇరికించడానికి కుట్ర జరుగుతోందని, ఆ డబ్బు గురించి తనకు ఏ మాత్రం తెలియదని ఆయన వెల్లడించారు. "నేను ప్రయాణం నుంచి తిరిగి వచ్చాను. నా బట్టలు తీసి పడకగదిలో కూర్చున్నాను. నా పెంపుడు కుక్క నా పక్కనే ఉంది. బహుశా అప్పుడే ఎవరో వీడియో తీసి ఉంటారు. ఆ డబ్బు గురించి నాకు తెలియదు. అంత డబ్బు ఉంటే నేను దాన్ని బీరువాలో ఉంచేవాడిని. మాకు మాతోశ్రీ(ఉద్ధవ్ ఠాక్రే నివాసం) లాంటీదేమీ లేదు. ఎవరో కావాలనే ఈ వీడియో తీసి ఉంటారు. వారు ఉద్దేశపూర్వకంగా ఒక కథనాన్ని సృష్టిస్తున్నారు" అని సంజయ్ శిర్సాత్ తెలిపారు.
ఐటీ నోటీసు.. మరో వివాదం
ఔరంగాబాద్(వెస్ట్) ఎమ్మెల్యే అయిన సంజయ్ శిర్సాత్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపిన ఒకరోజు తర్వాత ఈ వీడియో బయటపడింది. దీనిపై త్వరలోనే ఐటీ శాఖకు తన వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పారు. కొందరు తనపై ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారని.. ఈ క్రమంలో ఐటీ శాఖ నోటీసు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. దీనికి సమాధానం ఇవ్వడానికి సమయం కోరామని తెలిపారు. చట్టం తన పనిని చేసుకుపోతోందని.. దానితో ఎలాంటి సమస్య లేదన్నారు. తాను ఎలాంటి ఒత్తిడిలో లేనన్నారు.
మరో షిండే సేన నాయకుడు, ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై ఇటీవల నమోదైన కేసు చుట్టూ రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన కేసును ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంజయ్ గైక్వాడ్ చర్యను ఖండించగా.. ప్రతిపక్షం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications