ఊహించని ట్విస్ట్: ట్రయాంగిల్ లవ్ స్టోరీ హత్యలో కులం కోణం?, ఇదీ జరిగింది..

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలోని దొడ్డబాళ్లపురం తాలుకా కంచిగనాళలో చోటు చేసుకున్న యువకుడి హత్య వెనుక పలు ఆసక్తికర కోణాలు వెలుగుచూస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీయే అతని హత్యకు కారణమని తెలియగా.. తాజాగా ఆ యువకుడికి యువతి రాసిన ప్రేమ లేఖలు బయటపడ్డాయి. హత్య వెనుక కులం కోణం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది..

యువతికి లిఫ్ట్ ఇచ్చాడని గొడవ:

యువతికి లిఫ్ట్ ఇచ్చాడని గొడవ:

స్నేహితులైన హరీష్, సంతోష్ ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. అయితే యువతి మాత్రం హరీష్‌‍కు సన్నిహితంగా మెలగడం సంతోష్‌కు నచ్చలేదు. ఇటీవల అమ్మాయికి హరీష్ తన ఆటోలో లిఫ్ట్ ఇచ్చిన విషయం సంతోష్‌కు తెలిసింది. దీంతో హరీష్‌తో గొడవపడి అతన్ని బెదిరించాడు.

అవమానంగా భావించి హత్య..:

అవమానంగా భావించి హత్య..:

సంతోష్ తనను బెదిరించడంతో హరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ కోసం గ్రామంలోకి వచ్చిన పోలీసులు సంతోష్ ఇంటికెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన సంతోష్.. మంగళవారం రాత్రి గ్రామంలోని అశ్వత్థకట్ట వద్ద హరీష్‌తో మరోసారి గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో.. కత్తితో హరీష్‌ గొంతు, ఎద భాగాల్లో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎవరీ ఇద్దరు?:

ఎవరీ ఇద్దరు?:

కంచిగనాళ గ్రామాని చెందిన సంతోష్‌ (24), హరీష్‌ (24) ఇద్దరి చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. సంతోష్‌ వ్యవసాయం చేసుకుంటుండగా, హరీష్‌ చదువు మధ్యలోనే ఆపేసి షేర్‌ ఆటో నడుపుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా.. ఏడాది కాలంగా హరీష్, ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అయితే యువతి తమ కులానికి చెందిన అమ్మాయి కావడంతో సంతోష్ కూడా ఆమెను ఇష్టపడ్డాడు. ఆ తర్వాత సంతోష్, హరీష్ లు శత్రువులుగా మారిపోయారు. చివరకు హత్య దాకా వచ్చింది.

కులం కోణం..:

కులం కోణం..:

తాము తక్కువ కులానికి చెందినవారం కాబట్టే.. తమ అబ్బాయికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక యువతి తల్లిదండ్రులే సంతోష్ తో ఈ హత్య చేయించారని హరీష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, హరీష్ వల్ల యువతి గర్భవతి అయినట్టు తెలుస్తోంది. దీంతో హరీష్ కు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకనే సంతోష్ ను హత్యకు ఉసిగొల్పారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇద్దరితోనూ ప్రేమా?:

ఇద్దరితోనూ ప్రేమా?:

మరోవైపు హరీష్‌కు యువతి రాసిన ప్రేమలేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యంగా ఆ యువతి ఇద్దరు యువకులతోనూ ప్రేమ సాగిస్తోందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే, ఇన్నేళ్లలో ఎప్పుడూ తమ వద్ద కులం గొడవలు జరగలేదని, ఇప్పుడిలాంటి ఘటనలు చోటు చేసుకోవడం భయాందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. హరీష్, సంతోష్, సదరు యువతి ఇళ్లు గ్రామంలోని ఒకే వీధిలో ఉండడంతో ఎప్పుడేం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Triangle Love story Ends in Bloodshed, Victim's family alleged that his girlfriend family is behind his murder. They alleged because of low caste they killed their son.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి