ఓయోలో ప్రియుడితో భార్య రచ్చ.. పిల్లల ఎంట్రీతో అర్ధనగ్నంగా పరుగో పరుగు

ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. భర్తను కాదని ప్రియుడితో సుఖం కోరుకుంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో పిల్లలతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు భర్త. దీంతో ఏం చేయాలో తెలియని వివాహిత అర్ధనగ్నంగా రోడ్ల మీద పరుగులు తీసింది.

ఈ ఘటన మీరట్‌లో చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్‌కి వెళ్లగా, ఆమె ఉన్న ప్లేస్‌ను గుర్తించిన భర్త తన పిల్లలతో సహా అక్కడికి వెళ్ళి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భర్త రావడంతో ఆమె అర్థనగ్నంగానే గోడ దూకి, ఉరుకులు, పరుగులతో తుప్పల్లోంచి పారిపోయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 'ది ఒరిజినల్ ఫైల్స్' అనే ఇన్‌స్టా పేజీలో పోస్ట్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Caught Red-Handed Husband Busts Wife with Boyfriend in OYO Room

ఒక నెటిజన్ "ఇప్పుడు భర్త భరణం ఇవ్వడానికి సిద్ధమవ్వాలి. ఎందుకంటే ఆమె కోర్టులో కేసు వేస్తే, జడ్జి భర్తకే శిక్ష వేస్తాడు" అని వ్యంగ్యంగా కామెంట్ చేయగా, మరొకరు "ఆమె పిల్లలు ఆమెలా అవ్వకూడదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు "తాత్కాలిక శారీరక సుఖం కోసం కుటుంబ విలువలు, బాధ్యతలను పణంగా పెట్టి బరితెగిస్తున్న ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా చట్టాలు తీసుకురావాలి" అని డిమాండ్ చేశారు. ఈ ఘటన కుటుంబ బంధాలపై సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని, దాని పర్యవసానాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+