వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్‌రాకెట్‌లో బలవంతంగా బంగ్లాదేశ్ గర్ల్స్,తప్పించుకొని

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: సీబీ-సీఐడీ పోలీసులు సోమవారం చెన్నైలో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు.

మంజునాథ్ అనే 32 ఏళ్ల వ్యక్తి, ఆయన 28 ఏళ్ల భార్య కాజోలీ అలియాస్ అంజలిలు బంగ్లాదేశ్ నుండి నలుగురు యువతులను రెండేళ్ల క్రితం తీసుకు వచ్చారు.

ఓ మానుఫ్యాక్టరింగ్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ నలుగురిని వారు తీసుకు వచ్చారు. కానీ, ఇక్కడకు వచ్చాక వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.

సెక్స్ రాకెట్

సెక్స్ రాకెట్

ఇందులోని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి ఇటీవల గుర్తింపులేని పాస్‌పోర్టుతో మధురై పోలీసులకు పట్టుబడింది. పోలీసులు ఆమెను విచారించారు. విచారణలో ఆమె సెక్స్ రాకెట్ అంశాన్ని పోలీసులకు చెప్పింది.

సెక్స్ రాకెట్

సెక్స్ రాకెట్

ఆమె నుండి పూర్తి సమాచారం తీసుకున్న సీబీ-సీఐడీ పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు. మంజునాథ్, కాజోలి, వెల్రాజ్, సతీష్, కతీజా బీవీ, నాగలింగంలను అరెస్టు చేశారు.

సెక్స్ రాకెట్

సెక్స్ రాకెట్

వెల్రాజ్, సతీష్‌లు మధురైలో ఉంటున్నారు. కతీజా, నాగలింగంలు కరైకల్‌కు చెందిన వారు. కాగా, తమను వ్యభిచారంలోకి నెట్టిన వీరు.. తమను పలు ఇళ్లు తిప్పారని ఆ యువతి పోలీసులకు చెప్పింది.

 సెక్స్ రాకెట్

సెక్స్ రాకెట్

కాగా, సీబీ - సీఐడీ సెక్స్ రాకెట్లోకి బలవతంగా దింపబడిన ఆ యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించింది. పోలీసులు ముందే ఈ సమాచారాన్ని బంగ్లాదేశ్‌లో ఉన్న తల్లిదండ్రులకు తెలిపి రప్పించారు. వారికి అప్పగించారు. అయితే, మిగతా ముగ్గురు బంగ్లాదేశ్ యువతుల ఆచూకీ పోలీసులకు లభించలేదు. వారిని వెతికే పనిలో పడ్డారు. మరోవైపు మంజునాథ్ గతంలో మూడు పలు చోరీ కేసుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

English summary
The CB-CID on Monday busted an interstate prostitution racket and arrested six people.Police said Manjunath, 32, and his wife M Kajoli alias Anjali, 28, brought four Bangladeshi women to Bangalore two years ago after promising to employ them at a spices manufacturing company. However, the women were forced into prostitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X