వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్దిక్ పటేల్‌ను హీరోగా.. ఆ సినిమాకు 100 కట్‌లు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ఉడ్తా పంజాబ్ సెన్సార్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సందర్భంగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గుజరాతీ సినిమా 'సాలాగతో సవాల్ అనామాత్' అనే సినిమాకు సెన్సార్ బోర్డు వంద కట్‌లు చెప్పిందని అంటున్నారు.

పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ను ఇందులో హీరోగా చూపించారు. ఈ పాత్రలో దీపక్ పటేల్ నటించాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు సంబంధించిన అన్ని అంశాలతో పాటు పటీదార్, పటేల్ పదాలను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది.

CBFC orders 100 cuts for Gujarati film Salagato Sawaal Anamat

రాజద్రోహం కేసులో ఇరుక్కున్న హార్దిక్ పటేల్‌ను సినిమాలో హీరోగా చూపించడం పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని దర్శకుడు రాజేష్ గోహిల్ అన్నారు. పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో తమ సినిమా తెరకెక్కుతోందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. పటీదార్ పదాన్ని తొలగిస్తే తాము తీసిన సినిమాకు అర్థం ఉండదన్నారు.

English summary
Even as the makers of Udta Punjab celebrate the Bombay high court clearing their film with just one cut, Central Board of Film Certification (CBFC) has ordered 100 cuts for a film on Gujarat’s Patidar quota stir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X