వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డి మరో రెండు కేసులు నమోదుచేసిన సిబిఐ

మాజీ టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు సన్నిహితులపై మరో రెండు కేసులను సిబిఐ నమోదు చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :మాజీ టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డిపై మరో రెండు కేసులను సిబిఐ నమోదుచేసింది. శేఖర్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున నగదును, బంగారాన్ని ఆదాయపు పన్నుశాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు. శేఖర్ రెడ్డితో పాటు, ఆయన సన్నిహితులు కె. శ్రీనివాసులు, కె. ప్రేమ్ కుమార్ లపై కేసులు నమోదయ్యాయి.

శేఖర్ రెడ్డి తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్ళళో, కార్యాలయాల్లో రెండువేల కొత్త కరెన్సీని సుమారు 8 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ముగ్గురిని సిబిఐ ఇప్పటికే అరెస్టుచేసింది.తాజాగా వీరిపై రెండు కేసులను సిబిఐ నమోదుచేసింది.

cbi slaps 2 more cases against sekhar reddy

గత ఏడాది డిసెంబర్ రెండవ వారంలో వీరి నుండి 131 కోట్ల నగదుతో పాటు, 177 కోట్ల బంగారాన్ని కూడ స్వాధీనం చేసుకొన్నారు .వీరిని అరెస్టుచేసిన తర్వాత తమిళనాడు మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

శేఖర్ రెడ్డి కాంట్రాక్టర్, ఆయన అధికార అన్నాడిఎంకెలో పార్టీ నాయకుడిగా ఉన్నాడు. అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా ఉండడమే కాకుండా కాంట్రాక్టులు చేసేవాడు. వీరు ముగ్గురు కూడ గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు, ఇతరుల చేత పాత నోట్లను మార్పిడి చేసుకొన్నారని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొందరు బ్యాంకు అధికారులు కూడ వీరికి పాత నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకు సహకరించారనే అనుమానాన్ని సిబిఐ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.శేఖర్ రెడ్డి కేసును చెన్నైలోని సిబిఐ కొత్త కోర్టుకు బదిలీ చేశారు.

English summary
cbi has registered two more cases against former ttd board member sekhar reddy, his associates k.srinvasulu and K.Prem Kumar in connection with two instances of cash seizures by the income-tax department in which new Rs 2,000 notes worth Rs 8 crore and Rs 1.63 crore were seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X