CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!

నేటి డిజిటల్ యుగంలో వార్తలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పడం కష్టం. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్ష పత్రాలు విద్యార్థులకు మార్కులే కాదు, గంతకు మించిన వినోదాన్ని, ఆశ్చర్యాన్ని పంచుతున్నాయి. గతంలో గణితం పేపర్ 'రిక్ రోల్' వీడియోతో వార్తల్లో నిలవగా, ఇప్పుడు హిస్టరీ (చరిత్ర) పేపర్ సోషల్ మీడియా స్టార్ 'ఓరీ' పుణ్యమా అని వైరల్ అవుతోంది.

సాధారణంగా బోర్డు పరీక్షలంటే విద్యార్థుల్లో ఒక రకమైన భయం, ఒత్తిడి ఉంటుంది. కానీ 2026 సిబిఎస్ఇ (CBSE) 12వ తరగతి విద్యార్థులకు మాత్రం ఈ పరీక్షలు లైఫ్ టైమ్ మెమరీగా మిగిలిపోతున్నాయి. మార్చి 30న జరిగిన హిస్టరీ బోర్డు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

cbse-exam-2026-class-12-history-paper-qr-code-redirects-students-to-orrys-page-sparking-viral-react

ఏముంది ఆ క్యూఆర్ కోడ్‌లో?

పరీక్ష పత్రం యొక్క ప్రామాణికతను తనిఖీ చేయడానికి ఉద్దేశించిన ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే, అది ప్రముఖ ఇంటర్నెట్ పర్సనాలిటీ, సెలబ్రిటీల స్నేహితుడు ఓర్హాన్ అవత్రామణి అలియాస్ 'ఓరీ' కి సంబంధించిన సెర్చ్ పేజీకి దారితీసింది. అనుమానం వచ్చిన కొందరు స్వయంగా సెట్-1 మరియు సెట్-3 పేపర్లను వెరిఫై చేయగా, ఆ క్యూఆర్ కోడ్ నిజంగానే ఓరీ ప్రొఫైల్‌ను చూపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.

ఓరీ స్పందన: "నా కల నిజమైంది!"

ఈ విషయం తెలుసుకున్న ఓరీ, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ మురిసిపోయారు. "ఓ మై గాడ్.. నేను సిబిఎస్ఇ ఎగ్జామ్ పేపర్‌పై ఉన్నాను. ఇది నా కల" అంటూ సంబరపడిపోయారు. "సిబిఎస్ఇ పేపరే ఇప్పుడు కొత్త ఫుల్‌ఝడి ప్యాకెట్" అంటూ సరదాగా క్యాప్షన్ కూడా ఇచ్చారు.

గతంలో 'రిక్ రోల్' ప్రాంక్..

సిబిఎస్ఇ పేపర్ ఇలా వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చి 9న జరిగిన మ్యాథ్స్ (గణితం) పేపర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. ప్రఖ్యాత సింగర్ రిక్ ఆస్ట్లీ పాడిన "నెవర్ గన్నా గివ్ యు అప్" అనే వీడియో ప్లే అయ్యింది. ఇంటర్నెట్ భాషలో దీనిని 'రిక్ రోల్' ప్రాంక్ అని పిలుస్తారు. అప్పట్లో ఈ అంశంపై బోర్డు స్పందిస్తూ.. ఆ కోడ్ కేవలం భద్రత కోసం మాత్రమేనని, కంటెంట్ కోసం కాదని క్లారిటీ ఇచ్చింది.

విద్యార్థుల రియాక్షన్:

పరీక్షల ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు ఈ ఘటనలు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల మీమ్స్, జోకులు పేలుతున్నాయి. "చరిత్ర పేపర్లో చరిత్ర సృష్టించిన ఓరీ" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మకమైన జాతీయ బోర్డు పేపర్లలో ఇలాంటి సాంకేతిక లోపాలు రావడం భద్రతా పరమైన ఆందోళనలను కూడా కలిగిస్తోంది.

టెక్నాలజీ ,పాప్ కల్చర్ మిళితమై చదువును కూడా ఒక మీమ్ లా మార్చేయడం ఆశ్చర్యకరం. విద్యార్థులకు ఇది వినోదాన్ని పంచినప్పటికీ, లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న బోర్డు పరీక్షల్లో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరి ఓరీ సెర్చ్ రిజల్ట్‌పై సిబిఎస్ఇ అధికారికంగా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+