బెంగళూరులో సీసీటీవీ ఫుటేజీలో దొరికిన హీరోయిన్: ఆలస్యంగా వెలుగులోకి..!!
ప్రముఖ నటి ఒకరు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. దీంతో ఆమె అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ నటి ప్రమేయం ఉందని పోలీసులు తాజాగా నిర్ధారించారు. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు సిటీ సైబర్ క్రైమ్ సెల్ పోలీస్ సూపరింటెండెంట్ అనూప్ షెట్టి వెల్లడించారు.
బెంగళూరు బ్యాటరాయణపురలో ఈ నెల 4వ తేదీ వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్య హోటల్ సమీపంలో బైక్ పై ఆసుపత్రికి వెళ్తోన్న ముగ్గురిని ఓ నలుపురంగు బ్లాక్ కలర్ కారు ఢీ కొట్టి, వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని అనూష, అనిత, కిరణ్ అని గుర్తించారు. వీధి కుక్కలను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పింది. అదే సమయంలో కారు వారిని ఢీకొట్టింది. అతని కాలు విరిగింది. మిగిలిన ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.

వారిని బీజీఎస్ ఆసుపత్రికి తరలించారు. అనితకు సర్జరీ చేయాల్సి వచ్చింది. దీనికి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చయింది. కాలు విరగడం వల్ల చాలాకాలం పాటు ఆమె మంచానికే పరిమితం కావాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 7వ తేదీన హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
ఆ బ్లాక్ కలర్ కియా కారు ప్రముఖ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దివ్య సురేష్‌కు చెందినదిగా గుర్తించారు. ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన చోటు చేసుకోగా దివ్య సురేష్ ఇప్పటివరకు ఈ విషయాన్ని తమకు తెలియజేయలేదని, బాధితులు లేదా వారి కుటుంబీకులను కూడా పరామర్శించలేదని సైబర్ క్రైమ్ సెల్ ఎస్పీ అనూప్ షెట్టి చెప్పారు.
దివ్య సురేష్ కారు నడిపినట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డయిందని వివరించారు. ఒకే బైక్ పై ముగ్గురు వెళ్లడం, అతి వేగం ప్రమాదానికి కారణం కావొచ్చని వెల్లడించారు. వీధికుక్కుల నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ అదుపు తప్పగా.. అదే సమయంలో దివ్య సురేష్ నడుపుతున్న కారు వీరిని ఢీకొట్టిందని తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, త్వరలోనే దివ్య సురేష్ ను అదుపులోకి తీసుకుంటామని అన్నారు. హిరణ్య, టెంప్ట్ రాజా, రౌడీ బేబీ, కెంపు హలది హసిరు వంటి సినిమాలతో పాటు త్రిపురసుందరి టీవీ సీరీస్ లో నటించారామె.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications