Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrayan-3: చంద్రయాన్ విజయంపై ప్రముఖుల ప్రశంసలు.. చరిత్ర సృష్టించిన భారత్..

Chandrayan-3: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఉత్కంఠకు గురిచేసిన అతిపెద్ద ఈవెంట్ చంద్రయాన్-3 ప్రయోగం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టాలను కోవటం అతిపెద్ద కల. పెద్ద దేశాలుగా చెప్పుకునే అమెరికా, రష్యా, చైనాలు సైతం ఇక్కడ మెుదటగా అడుగుపెట్టలేకపోయాయి. పైగా రష్యా చేసిన ప్రయత్నం ఇటీవల విఫలమైంది.

ఈ క్రమంలో 140 కోట్ల మంది భారతీయులు చేసిన పూజలు.. చంద్రయాన్ సూపర్ సక్సెస్ కావాలని కోరుకున్న వారి ఆశలు ఫలించిన చారిత్రాత్మక దినంగా ఆగస్టు 23, 2023 నిలిచిపోయింది. చరిత్ర పుటల్లో ఒక అధ్యాయానికి నాంది పలికిన భారతావని అరుదైన ప్రయోగాన్ని తక్కువ ఖర్చులో పూర్తిచేసి చంద్రుడిపై అడుగుపెట్టడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు.

Celebrities and Telugu states Political leaders over Chandrayan-3 Success

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి నుండే లాండింగ్ ప్రక్రియను డిజిటల్‌గా పరిశీలించారు. ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశం గర్వించే విధంగా చంద్రునిపైకి భారత్ విజయవంతంగా అడుగుపెట్టడాన్ని కొనియాడారు.

చంద్రయాన్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు. ఈ రోజు చరిత్ర సృష్టించబడిందన్న ఆయన.. బిలియన్ల మంది భారతీయులు గర్వించదగినదని అన్నారు.

మళయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ చంద్రయాన్ సక్సెస్ కావటంపై ఇస్రో శాస్ర్తవేత్తలను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

చంద్రయాన్-3 సక్సెస్ కావటంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత్ సాధించిన అపురూపమైన విజయం అని సీఎం అన్నారు. విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు భారతదేశంలోని ప్రతి పౌరుడితో పాటు తాను కూడా గర్వంతో నిండిపోయానని ఇస్రో ట్వీట్ ను రీట్వీట్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రయాన్ విజయంపై అభినందనలు తెలిపారు. దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచిందని ట్వీట్ చేశారు.

చంద్రయాన్-3ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అలుపెరగని ప్రయత్నాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. అంతరిక్షంలో భారత్ కొత్త యుగాన్ని ప్రారంభించిందని.. ఇది భారతీయ శక్తికి నిదర్శనమని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+