రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్రం: మిర్చి క్వింటాలుకు రూ.5వేలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/హైదరాబాద్: మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం స్పందించింది. క్వింటాలు మిర్చికి రూ.5వేలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీల ద్వారా మే 31 వరకు కొనుగోలు చేయాలని పేర్కొంది.

కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ తెలిపారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ ద్వారా తెలుగుు రాష్ట్రాల్లో మిర్చి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

 Center declares quintal mirchi price Rs 5000

కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు 50-50శాతం నష్టం భరించాలని అన్నారు. అదనపు ఖర్చుల కోసం రూ.1250 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిర్చి రైతులు మద్దతు ధర లేక ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Center government on Wednesday declared quintal mirchi price Rs 5000.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి