ఫైనల్లీ వాళ్ళు అనుకున్నది సాధించారు ... ట్రాన్స్ జెండర్ లకు కేంద్రం గుడ్ న్యూస్
సమాజంలో హిజ్రాలుగా పిలవబడే ట్రాన్స్ జెండర్ లను చిన్నచూపు చూస్తున్నారని, స్త్రీ , పురుషులతో సమానంగా చూడటం లేదని చాలా సందర్భాల్లో హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి హిజ్రాల పట్ల లింగ వివక్ష లేదని , సామర్ధ్యం ఉంటే వాళ్ళు ఏ వృత్తిలో అయినా రాణిస్తారని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇక లాంటి ట్రాన్స్ జెండర్ ల కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది .
పురుషులు, మహిళలతో పాటు తమకు సమాన అవకాశాలు కల్పించాలని ట్రాన్స్ జెండర్ లు కొన్ని సంవత్సరాలుగా పోరాటమే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని రూపొందించింది. ఇక ఈ చట్టం ఆధారంగా ఇకపై కేంద్ర ప్రభుత్వం నియమించే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో మేల్, ఫిమేల్ ఆప్షన్ తో పాటు ట్రాన్స్‌జండర్ అనే ఆప్షన్‌ను పొందుపరచనుంది.ఇక స్త్రీ, పురుషులతో సమానంగా వారి జెండర్ ను కూడా చేర్చటం ట్రాన్స్ జెండర్ లకు నిజంగా గుడ్ న్యూస్ .

ఇప్పటి వరకు బాగా చదువుకున్న ట్రాన్స్ జెండర్ లు ఏదైనా ఉద్యోగ దరఖాస్తుకు స్త్రీగా ఆప్షన్ పెట్టాలా , పురుషుడుగా ఆప్షన్ పెట్టాలా తెలియక తెగ ఇబ్బంది పడేవాళ్ళు . ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి స్త్రీపురుషులతో సమానంగా చోటు ఇవ్వటమే కాకుండా ఒక గౌరవాన్ని కూడా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇచ్చినట్లు అవుతుంది. ఇదే విషయంలో ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది. అంతే కాకుండా లింగమార్పిడి చేసుకున్నవారికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నియమావళిని కూడా మార్చాలని ఆదేశాలు జారీచేసింది. ఇది నిజంగా సామాజిక వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ లకు శుభ వార్తే .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications