ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మళ్లీ ఆయనే..!!
న్యూఢిల్లీ: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతోండటం.. దానితో పోటీ పడుతోన్న ద్రవ్యోల్బణం.. తరచూ రెపో రేటు పెంపు, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వంటి పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ)నకు డిప్యూటీ గవర్నర్‌ను పునర్నియమించింది. ఇప్పుడు ఉన్న డాక్టర్ మైఖెల్ దేబబ్రత పాత్రాను అదే స్థానంలో రీ అపాయింట్‌మెంట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
డాక్టర్ మైఖేల్ దేబబ్రత పాత్ర 2020 జనవరి 14వ తేదీన రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా అపాయింట్ అయ్యారు. అప్పట్లో మూడేళ్ల పదవీ కాలాన్ని నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య స్థానాన్ని దేబబ్రత పాత్రతో భర్తీ చేసింది. ఈ నెల 14వ తేదీతో దేబబ్రత పాత్రా మూడేళ్ల పదవీకాలం ముగియాల్సి ఉంది.

కొత్త ఆర్థిక నిపుణుడిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవి కోసం కొన్ని పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త వారినెవరినీ ఎంపిక చేయలేదు. దేబబ్రతనే కొనసాగించాలని నిర్ణయించింది.
దేబబ్రత పాత్రాకు రిజర్వుబ్యాంకులో పని చేసిన అనుభవం ఉంది. ఇదివరకు ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, పాలసీ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, మానిటరీ పాలసీ డిపార్ట్‌మెంట్, న్యూ ఫ్రాంటియర్స్ యూనిట్.. వంటి కొన్ని కీలక విభాగాలకు తన సేవలను అందించారు. వస్తు, సేవల పన్ను చట్టానికి సంబంధించి డ్రాఫ్ట్ రూపకల్పనకు తన వంతు కృషి చేశారు.

దేబబ్రత పాత్రా ఉన్నత విద్యావంతుడు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ-బోంబే నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సెంట్రల్ బ్యాంకర్‌గా ఆయన తన కేరీర్‌ను ఆరంభించారు. దేశంలో ఇప్పుడు నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, జీఎస్టీ వర్తింపు.. వంటి పరిస్థితుల్లో మైఖెల్ దేబబ్రత పాత్రను డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్థికరంగంలో పలు అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications