Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Prime Minister of Bharat: భారత్ పేరును వాడేస్తున్న కేంద్రం ! పార్లమెంటులో బిల్లు వద్దా ?

త్వరలో జరిగే జీ20 సదస్సుకు విదేశీ అతిధులకు పంపిన ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో కేంద్రం ఆహ్వానాలు పంపడంపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్న వేళ తాజాగా మరిన్ని చోట్ల కేంద్రం ఇలా భారత్ పేరును వాడేస్తుందన్న విషయం బట్టబయలైంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో ప్రధాని మోడీని సంబోధిస్తూ పలు పత్రాల్లో భారత్ పేరును కేంద్రం వాడేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా జరిగిన బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సు ఆహ్వానాల్లోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరును కేంద్రం వాడింది. బ్రిక్స్ దేశాలకు పంపిన ఆహ్వానాల్లో ఇలా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు వాడారు. అలాగే తాజాగా ప్రధాని మోడీ ఇండోనేషియాలో జరిగే ఆసియాన్-ఇండియా సదస్సుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పత్రాల్లోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరు కనిపించింది. దీంతో ఎవరికీ చెప్పకుండానే కేంద్రం ఇలా భారత్ పేరు వాడేస్తుందన్న చర్చ జరుగుతోంది.

centre already using Prime Minister of Bharat name in several documents without parliament nod
ఇలా కేంద్రం ఇండియాకు బదులుగా విచ్చలవిడిగా భారత్ పేరును వాడేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఇదంతా చూస్తుంటే మోడీ సర్కార్ ఎంత గందరగోళంలో ఉందో అర్ధమవుతోందని ఆయన ఆరోపించారు. విపక్షం అంతా ఒక్కతాటిపైకి రావడం, వారి కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని విమర్శించారు. కాంగ్రె్ కే చెందిన మరో ఎంపీ శశిథరూర్ మాత్రం భారత్ పేరు మార్పును స్వాగతిస్తున్నారు.

ఇండియా లేదా భారత్ పేరు వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దాన్ని అమలు చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉంటుంది. కానీ పార్లమెంటుకు సైతం చెప్పకుండా, దేశ ప్రజలకు తెలియకుండా కేంద్రం ఇండియాగా ఉన్న పేరును భారత్ గా మార్చి వాడుకోవడాన్ని బట్టి చూస్తుంటే కేంద్రం వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందన్న చర్చ జరుగుతోంది. దీంతో రాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పు బిల్లు పెడతారన్న అంచనాలు కూడా కరిగిపోతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+