Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

India : ఇండియా పేరు మార్పుపై తేల్చేసిన కేంద్రం -అంత ఎలర్జీ ఎందుకన్న అనురాగ్ ఠాకూర్

ఇండియా పేరు మార్పుపై కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. తాజాగా జీ20 సదస్సు ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గానూ, బ్రిక్స్, ప్రధాని మోడీ ఆసియన్-ఇండియా సదస్సు టూర్ లోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అనే పేర్లు వాడటంతో త్వరలో జరిగే పార్లమెంట్ భేటీలో ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలొచ్చాయి. దీనిపై విపక్షాలు కూడా మండిపడ్డాయి. ఇది సమాఖ్య వ్యవస్ధపై దాడిగా అభివర్ణించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ స్పందించింది.

ఇండియా పేరు మార్పుపై జరుగుతున్న చర్చలపై స్పందించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. అవన్నీ కేవలం వదంతులే అన్నారు. జీ20 విందు ఆహ్వానం తర్వాత భారతదేశంలో రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ.. కేంద్రమంత్రి దీన్ని కేవలం ప్రచారంగా మాత్రమే తెలిపారు. జాతీయ పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

centre clarifies on renaming india as bharat, union minister anurag thakur says just rumours

మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియా పేరు భారత్ గా మారడంపై విపక్షాలు చేస్తున్న రచ్చను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుబట్టారు. ఇది 'భారత్' అనే పేరు మీద వారు 'భారత్'కి ఎలా వ్యతిరేకంగా ఉన్నారనేది తెలుస్తోందన్నారు. వారి మనస్తత్వాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుందని ఠాకూర్ తెలిపారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని తాను భావిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, భారత్ అనే పదాన్ని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.

జీ20 సదస్సు విందు ఆహ్వానంపై 'భారత్ ప్రెసిడెంట్' అని ప్రస్తావించడంపై స్పందిస్తూ.. ఆమె భారత రాష్ట్రపతి కాబట్టి అలా రాశాం. ఇందులో తప్పేముందని ఠాకూర్ ప్రశ్నించారు. ఇంతకు ముందు కూడా భారత్ సర్కార్ పేరుతో ఎన్నో ఆహ్వానాలు పంపామన్నారు. ఇందులో అసలు సమస్య ఎక్కడుందని అడిగారు. తాను భారత ప్రభుత్వ మంత్రినని, చాలా న్యూస్ ఛానళ్లు సైతం భారత్ పేరుతో ఉన్నాయని, విపక్షాలకు భారత్ పేరంటే అంత అలర్జీ ఎందుకన్నారు. భారత్ పేరును ఇప్పుడు ఎవరు వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+