ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం: టమోటా తరువాత..!!
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌లో నిన్న, మొన్నటి వరకు టమోటా రేట్లు ఏ స్థాయికి చేరుకున్నాయో తెలిసిన విషయమే. కేజీ టమోటా 250 రూపాయల వరకు పలికిన రోజులు ఉన్నాయి. టామోటాను సాగు చేసిన కొందరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు.
ఇప్పుడు టమోటా రేట్లు ఫర్వాలేదనిపించేస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ టమోటా 45 రూపాయల వరకు పలుకుతోంది. మున్ముందు ఈ ధర మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. టమోటా పంట దిగుబడి భారీఎత్తున ఉండటం, చాలినంత స్టాక్ మార్కెట్‌కు చేరుకోవటం వల్ల వాటి రేట్లు తగ్గాయి.

అదే సమయంలో ఉల్లి రేట్లు ఆకాశానికి ఎగబాకడం మొదలు పెట్టాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరున్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లిపంట దెబ్బతిన్నది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో చాలినంత ఉల్లి అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా- వాటి రేట్లు క్రమంగా పెరుగుతోన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి 50 నుంచి 60 రూపాయల వరకు ఉంటోంది. మున్ముందు ఈ ధర మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఉల్లి ఎగుమతులపై వసూలు చేస్తోన్న పన్ను మొత్తాన్ని భారీగా పెంచింది. ఉల్లి ఎగుమతిదారులు చెల్లించే పన్నుపై 40 శాతం మేర అదనపు భారాన్ని మోపింది. ఈ పెంపుదల తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
ఈ ఏడాది చివరి వరకూ అంటే- డిసెంబర్ 31వ తేదీ వరకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం అదనపు పన్ను భారం కొనసాగుతుంది. ఆ తరువాత- అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మరింత పొడిగించాలా? లేక తొలగించాలా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఈ చర్య వల్ల ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గిపోతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా- ఎగుమతి అయ్యే ఉల్లి మొత్తం దేశీయ మార్కెట్‌కు తరలుతుంది. ఉల్లి కొరత ఏర్పడబోదని కేంద్రం యోచిస్తోంది. భారీ వర్షాలతో పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. ఉల్లి ధరలను ప్రభావితం చేసిందని, దీన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకున్నామని తెలిపింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications