వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: ధరలు తగ్గే- పెరిగే వస్తువులు ఇవే: వారికి బిగ్ షాక్..!!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు తగ్గనున్నాయి. టీవీల తయారీ పరిశ్రమను మరింత ప్రోత్సహించడానికి వాటి ప్యానెళ్లపై ప్రస్తుతం అమలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరట కల్పించడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె పార్లమెంట్ లో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా కొనసాగించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బీజేపీ నాయకులు స్వాగతిస్తోండగా.. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తోన్నాయి. అంశాలవారీగా లోపాలను ఎత్తి చూపుతున్నాయి.

వేతన జీవులకు ఊరట కల్పించారు నిర్మల సీతారామన్. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వారిని పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపునిచ్చారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిపై 5, 6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను విధించారు. రూ.15 లక్షల వార్షికాదాయం దాటిన వారిపై 30 శాతం పన్ను విధించారు.

Centre has proposed to reduce basic customs duty on TV panels and increased on cigarettes

పొగతాగే వారికి చుక్కలు చూపించారు నిర్మల సీతారామన్. సిగరెట్ల తయారీపై అమలు చేస్తోన్న పన్నును 16 శాతం మేర పెంచారు. ఈ పెంపుదలను ప్రకటించిన కొద్దిసేపటికే సిగరెట్ తయారీ కంపెనీలు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, ఎన్టీసీ ఇండస్ట్రీస్, వీఎస్టీ ఇండస్ట్రీస్, గోల్డెన్ టుబాకో షేర్ల ధరలు క్షీణించాయి. అయిదు శాతం మేర పడిపోయాయి. అత్యధికంగా గాడ్ ‌ఫ్రే ఫిలిప్స్ షేర్ల ధరలు 4.92 శాతం మేర తగ్గాయి. మిగిలిన కంపెనీల షేర్లు కూడా రెండు శాతం మేర క్షీణించాయి.

సిగరెట్లతో పాటు బంగారు ఆభరణాల రేట్లు కూడా పెరగనున్నాయి. వాటిపైనా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచారు నిర్మలా సీతారామన్. గోల్డ్ బార్స్ నుంచి తయారు చేసిన బంగారు ఆభరణాలపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అదే సమయంలో వజ్రాల రేట్లపై విధించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు.

Centre has proposed to reduce basic customs duty on TV panels and increased on cigarettes

టీవీల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. టీవీ ప్యానెళ్లు, విడి భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించారు. ఫలితంగా టీవీ సంబంధిత ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు తగ్గుతాయి. వీటితో పాటు బొమ్మలు, సైకిళ్లు, ఆటోమొబైల్స్ రేట్లు కూడా తగ్గేలా ప్రతిపాదనలు చేశారు. వాటిపై ప్రస్తుతం వసూలు చేస్తోన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు.

కోటంరెడ్డి స్థానంలో కొత్త ఇన్‌ఛార్జ్- నెల్లూరులో కీలక నేతను దించనన్న జగన్..!!కోటంరెడ్డి స్థానంలో కొత్త ఇన్‌ఛార్జ్- నెల్లూరులో కీలక నేతను దించనన్న జగన్..!!

English summary
Centre has proposed to reduce basic customs duty on TV panels and increased on cigarettes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X