ల్యాప్ టాప్, ట్యాబ్లెట్, కంప్యూటర్లపై కేంద్రం షాక్-తక్షణం దిగుమతుల నిలిపివేత..!
దేశంలోకి విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీఎస్టీ కోడ్ హెచ్‌ఎస్‌ఎన్ 8471 కింద ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటీసులో తెలిపింది.
అయితే ఈ ఆంక్షలు ప్రస్తుతం అమల్లో ఉన్న బ్యాగేజీ దిగుమతులకు వర్తించబోవని వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.ఇ-కామర్స్ పోర్టల్‌ల నుండి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కొనుగోలు చేసిన వాటితో సహా ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్ లేదా అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌ను దిగుమతి చేసుకునేందుకు దిగుమతి లైసెన్సింగ్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది.

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టెస్టింగ్ బెంచ్‌మార్కింగ్, ఎవాల్యుయేషన్ రిపేర్, రీ-ఎగుమతి, ఉత్పత్తి అభివృద్ధి ప్రయోజనాల కోసం ఒక్కో సరుకుకు 20 వస్తువులకు ఇంపార్ట్ లైసెన్స్ నుండి మినహాయింపు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. దిగుమతి చేసిన వస్తువులను పేర్కొన్న ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని, విక్రయించకూడదన్న షరతులకు లోబడి ఈ దిగుమతులు అనుమతిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది
మరోవైపు ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఇందులో మరో మినహాయింపు కూడా ఇచ్చింది. మరేదైనా భారీ వస్తువుల తయారీలో వాడేందుకు అయి ఉంటే వాటికి ఈ ఆంక్షలు వర్తించవని కేంద్రం పేర్కొంది. అలా కాకుండా అనుమతుల్ని దుర్వినియోగం చేసి దిగుమతులు చేసుకుంటే మాత్రం చర్యలు తప్పవని నోటీసుల్లో స్పష్టం చేసింది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications