కాస్కోండి...ఢిల్లీ పీఠం మాదే, బీజేపి సవాల్ కు సై అన్న మమత

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్ కతా: బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి , బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రతి సవాల్ విసిరారు.బీజేపి విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్టు శుక్రవారంనాడు ఆమె ప్రకటించారు.

ధిల్లీ కోటను తమ పార్టీ ఖాతాలో వేసుకొంటామని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.తమ పార్టీని భయపెట్టాలనుకొంటే ఏనాడు జరగదన్నారు. బీజేపీని చూస్తే తమకు ఎలాంటి భయం లేదన్నారామె.

తమ పార్టీకి చెందిన నాయకులందరినీ జైలులో పెడతామని బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ సా బెదిరించినంత మాత్రాన బెదిరిపోమన్నారు. ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవడం ఖాయమన్నారు.

Mamata Banerjee

2019 ఎన్నికల సమాయానికి టీఎంసీని కూకటి వేళ్ళతో పెకిలించాలని బెంగాల్ బిజెపికి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే టీఎంసి మొత్తాన్ని జైళ్ళో పెట్టే రోజులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యాలకు ధీటుగానే మమత స్పందించారు. అమిత్ షా మమత నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.

రానున్న రోజుల్లో టీఎంసి ఢిల్లీని స్వంతం చేసుకొంటుంది. నన్ను ఎవరు ఛాలేంజ్ చేశారో వారి ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని ఆమె చెప్పారు. ఢిల్లీ నుండి వస్తున్నారు. అబద్దాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

బెంగాల్ ను స్వాధీనం చేసుకోవాలనే తొందరలో ఉన్నారు. గుజరాత్ ను పాలించలేని వారు ఇప్పుడు బెంగాల్ కోసం వస్తున్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Challenge accepted, West Bengal Chief Minister Mamata Banerjee roared on Friday, saying she was not scared of the BJP's threat to "put Trinamool Congress in jail" and vowed to "capture Delhi

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి