తమిళనాట కొత్త లెక్కలు, సైలెంట్ సపోర్ట్ - సంచలనం ఖాయం..ప్రముఖ సర్వే రిపోర్ట్..!!
తమిళనాడు ఎన్నికలు హోరా హోరీగా మారాయి. త్రిముఖ పోరులో గెలుపు ఇప్పుడు అధినేతల కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రెండు ప్రధాన కూటములతో తొలి సారి ఎన్నికల బరిలోకి దిగిన హీరో - విజయ్ పార్టీ ఢీ కొడుతోంది. విజయ్ గెలిచే సీట్లు.. ఓట్ల పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక్కడ గెలుపు కోసం బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ సర్వే సంస్థ ఎన్నికల్లో ఎవరిని గెలుపు వరిస్తుందనేది పూర్తి విశ్లేషణలతో తాజా అంచనాలను వెల్లడించింది. విజేత ఎవరో తేల్చేసింది.
తమిళనాడులో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. బీజేపీ అధినాయకత్వం అన్నా డీఎంకే తో జత కట్టి గెలుపు కోసం అన్ని శక్తులు ఒడ్డుతుంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత.. విజయ్ చీల్చే ఓట్లు తమకు కలిసి వస్తాయని బీజేపీ కూటమి అంచనా వేస్తోంది. అటు డీఎంకే పూర్తి స్థాయిలో తిరిగి తామే అధికారంలోకి వస్తామని భరోసా గా కనిపిస్తోంది. పలు పార్టీలతో జత కట్టి కూటమిగా బరిలోకి దిగుతున్న SPA లో డీఎంకే గెలిచే సీట్లే కూటమికి అధికారంలో కీలకం కానున్నాయి. ప్రధానంగా బీజేపీ -అన్నా డీఎంకే వ్యూహాలతో పాటుగా విజయ్ కు పడే ఓట్ బ్యాంక్ పైన సీఎం స్టాలిన్ ఫోకస్ చేసారు. ఇక.. విజయ్ కు సినీ గ్లామర్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రధాన ఓటింగ్ గా మారుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ నినాదంతో విజయ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆకట్టుకునే హామీలను ప్రజల ముందు ఉంచారు. దీంతో..అసలు ఓటర్ మూడ్ ఏంటనేది ఈ సర్వే వెల్లడించింది.

మళ్లీ డీఎంకే కూటమికే అధికారం దక్కే అవకాశాలు
ప్రముఖ సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ తమిళనాడుతో సహా ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాల్లో సర్వే చేసింది. అంచనాలను వెల్లడించింది. తమిళనాడుకు సంబంధించి ఆసక్తి కర అంశాలను విశ్లేషించింది. ఈ సంస్థ అంచనాల మేరకు ఈ ఎన్నికల్లో డీఎంకే నాయకత్వంలోని SPA కూటమి 42 -44 శాతం ఓటింగ్ తో 130-140 స్థానాలు గెలుచుకొని తిరిగి అధికారంలో కొనసాగుతుందని అంచనా వేసింది. అదే విధంగా ఎన్డీఏ కూటమి 36-40 శాతం ఓటింగ్ పొంది 90-100 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, విజయ్ టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో 10-13 శాతం ఓటింగ్ తో 8-14 సీట్లు మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతరులు 5-8 శాతం ఓటింగ్ తో 5-8 సీట్లు గెలుచుకుంటారని వివరించింది. విజయ్ పైన యూత్ లో ఎక్కువగా ఆదరణ ఉందని విశ్లేషించింది. మహిళలు ఎక్కువగా డీఎంకే కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని.. అర్బన్ ఓటింగ్ ఎన్డీఏ వైపు చూస్తున్నారని విశ్లేషించింది.












Click it and Unblock the Notifications