మతాంతర వివాహం...? పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన ఆ యువకుడి అరెస్ట్... వీడియో వైరల్..
ముస్లిం మతానికి చెందిన ఓ యువకుడు మరో మతానికి చెందిన ఓ యువతిని కోర్టులో పెళ్లి చేసుకునేందుకు వెళ్లగా చంఢీగఢ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ యువతిని బలవంతంగా తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టు ప్రాంగణం నుంచి అతన్ని లాక్కెళ్తూ పోలీస్ జీపు ఎక్కించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అతనితో పాటు ఉన్న ఆ యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై చంఢీగఢ్ సివిల్ లైన్స్ సర్కిల్ ఆఫీసర్ అనిల్ సమానియా మాట్లాడుతూ... ఆ యువకుడి పేరు సోను మాలిక్ అని, అలీగఢ్‌లో అతను టైలర్‌గా పనిచేస్తుంటాడని చెప్పారు. ఆ యువతితో పరిచయం పెంచుకున్న అతను... ఆమెను బలవంతంగా నిర్బంధించి వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కస్టడీకి తరలించినట్లు తెలిపారు.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాంటీ లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020 పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. గత శనివారం(నవంబర్ 28) నుంచే ఈ చట్టం ప్రకారం పెళ్లి కోసం మత మార్పిడికై అమ్మాయిలను బలవంతపెట్టేవారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు.
అంతేకాదు,కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించే పథకాన్ని కూడా రద్దు చేసే యోచనలో యోగి సర్కార్ ఉన్నది.ఈ స్కీమ్ కింద.. మతాంతర వివాహం చేసుకున్న వారికి రూ.50వేలు నగదు ప్రోత్సాహం అందిస్తారు.ఇందుకోసం ఆ జంట పెళ్లి జరిగిన రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత నగదు అందుతుంది. గత ఏడాది ఈ స్కీమ్ కింద 11 జంటలు లబ్ధి పొందాయి.ఈ ఏడాది నాలుగు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
The girl who came to #Aligarh to marry a man from another community. pic.twitter.com/aZtliJYgt0
— Anuja Jaiswal (@Anuja_Jaiswal11) December 4, 2020
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications