చంద్రయాన్ -2 శిధిలాల్ని కనిపెట్టిన ఘనుడు-ఇస్రో, నాసా ఫెయిలైనా ! ఈసారీ ఫోకస్..
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఇవాళ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేందుకు సిద్దమవుతున్న వేళ.. ఓ కీలక వ్యక్తిపైనా అందరి ఫోకస్ నెలకొంది. అతని పేరు షణ్ముగ సుబ్రమణియన్. ఇతనో సాప్ట్ వేర్ ఇంజనీర్. చెన్నైకు చెందిన ఈ టెకీ పేరు ఈసారి వినిపించడానికి ఓ కీలక కారణం ఉంది. గతంలో ఇస్రో, నాసాలకు కూడా సాధ్యం కాని రీతిలో చంద్రయాన్-2 ల్యాండర్ శిధిలాలు గుర్తించిన ఘనత ఇతనికి సొంతం. అప్పట్లో ఏం జరిగిందంటే..
2019 డిసెంబర్లో చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన తర్వాత విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో గుర్తించడంలో ఇస్రోతో పాటు నాసా కూడా విఫలమయ్యాయి. దీంతో ఇక విక్రమ్ ల్యాండర్ అప్పటివరకూ తీసిన చిత్రాలతో పాటు సేకరించిన సమాచారం కూడా దాంతో పాటే సమాధి అయినట్లేనని అంతా భావించారు. దీంతో అందరూ ఆశలు వదులుకున్నారు. కానీ చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు షణ్ముగ సుబ్రమణియన్ మాత్రం తాను ఓసారి ట్రై చేద్దాం అనుకున్నాడు.

అంతే కేవలం తన ల్యాప్ టాప్ సాయంతో సరికొత్త పరిజ్ఞానం వాడి ఇస్రో, నాసాకు సాధ్యం కాని రీతిలో విక్రమ్ ల్యాండర్ శిధిలాలు కనిపెట్టాడు. చాలా రోజులు చంద్రుని ఉపరితలం పాత, కొత్త చిత్రాలను జూమ్ ఇన్, అవుట్ చేస్తూ పిక్సెల్ బై పిక్సెల్‌తో పోల్చాడు. ఈ పద్ధతి, అసాధారణమైనప్పటికీ విక్రమ్ ల్యాండర్‌లో భాగమైన ఒకే క్రమరాహిత్యాన్ని బట్టి ఓ చుక్కను గుర్తించాడు. అక్కడే చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ శిధిలాలు లభ్యమయ్యాయి. దీన్ని నాసా కూడా ఆ తర్వాత ధృవీకరించింది.
దీంతో షణ్ముగ సుబ్రమణియన్ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది.
ఈసారి కూడా చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుబ్రమణియన్ గత కొన్ని రోజులుగా చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు బిజీగా ఉన్నారు. నిన్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ప్రయోగానికి ముందు తాను నిజంగా సంతోషిస్తున్నానని, రేపు మొత్తం ల్యాండింగ్ ప్రక్రియను చూడటానికి సెలవు పెడుతున్నట్లు తెలిపారు. అలాగే ల్యాండింగ్ సైట్ డిజిటల్ ఎలివేషన్ మోడల్‌లను అన్ని క్రేటర్స్, పర్వతాలతో సిద్ధం చేసానన్నారు. ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, ఫోటోగ్రాఫ్‌ల నుండి ప్రతిపాదిత ల్యాండింగ్ సైట్ చిత్రాలను ప్రాసెస్ చేసి ప్రచురించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications