Chandrayaan 3: ప్రజ్ఞాన్ ఆయుష్షు వారం రోజులే..?!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
ఇక రోవర్ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయి. అవన్నీ స్విచ్ ఆన్ అయ్యాయి. వాటి ద్వారా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు అందడం ఇదివరకే ఆరంభమైంది.

అన్నీ సక్రమంగా పని చేస్తూ, ఇస్రో శాస్త్రవేత్తలకు అవసరమైన డేటాను అందజేస్తోన్న ప్రజ్ఞాన్ రోవర్..ఇక చంద్రుడిపై చీకటి రాత్రలను ఎదుర్కొనబోతోంది. ఇంకో ఆరు రోజుల్లో లూనార్ నైట్స్ ఆరంభం కాబోతోన్నాయి. 14 రోజుల పాటు చంద్రుడిని చీకటి కమ్మేసి ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడే వాతావరణాన్ని తట్టుకునేలా ప్రజ్ఞాన్ రోవర్‌ను తీర్చిదిద్దలేదు ఇస్రో.
చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చీకటి రోజులు ఆరంభమైనప్పుడు చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన చలి ఆరంభమౌతుంది.
భూమి మీద 14 రోజుల కాలం.. ఒక లూనార్ నైట్‌తో సమానం. చంద్రుడిపై ఒక్క రాత్రి గడిచిపోవాలంటే భూమి మీద 14 రోజుల సమయం పడుతుంది. 14 రోజుల పాటు కాలంలో చంద్రుడి దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. చంద్రుడి ఈక్వేటర్ వద్ద చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈక్వేటర్ సమీపంలో మైనస్ 208 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది.
గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్‌కు లేదు. ఈ 14 రోజుల కాలం గడిచిపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే సమయానికి ఈ రోవర్ మనుగడ కొనసాగించగలుగుతుందా? లేదా? అనేది సవాల్‌గా మారింది. ఫలితంగా- ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications