ఇదిగో విక్రమ్ ఫుల్ ఫొటో: క్లిక్‌మనిపించిన ప్రజ్ఞాన్

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

ఇక రోవర్‌ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయి. అవన్నీ స్విచ్ ఆన్ అయ్యాయి. వాటి ద్వారా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు అందడం ఇదివరకే ఆరంభమైంది.

Chandrayaan 3: Pragyan Rover clicked an image of Vikram Lander including payloads

ఈ క్రమంలో ప్రజ్ఞాన్ రోవర్.. మరో తాజా ఫొటోలను ఇస్రోకు పంపించింది. ఇవి- తనను మోసుకొచ్చిన విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించినవి. కొద్దిసేపటి కిందటే ఇస్రో.. వీటిని విడుదల చేసింది. ఈ ఉదయం ప్రజ్ఞాన్ రోవర్.. ఈ ఫొటోలను తీసింది. రోవర్‌లో అమర్చిన నేవిగేషన్ ఆన్‌బోర్డ్ కెమెరాతో క్లిక్‌మనిపించింది.

ఎగుడు దిగుడుగా ఉన్న చంద్రుడి ఉపరితలం, పేలోడ్స్ ఈ రెండు ఫొటోల్లోనూ స్పష్టంగా కనిపిస్తోన్నాయి. ఈ రెండు పేలోడ్స్‌లల్లో ఒకటి- ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ. చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించడానికి దీన్ని పేలోడ్‌గా పంపించింది ఇస్రో. చంద్రుడిపై ఉల్కాపాతం సంభవించినా దాన్ని ముందుగానే పసిగట్టగలుగుతుంది. గతంలో చంద్రుడిని ఢీ కొట్టిన ఉల్కాపాతాల డేటానూ ఇది సంగ్రహించగలుగుతుంది.

రెండోది- చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్. ఇది- చంద్రుడి ఉపరితలం, భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రత వివరాలను సేకరిస్తుంది. ఉష్ణోగ్రతను కొలవడానికి 10 టెంపరేచర్ సెన్సర్లను ఈ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్‌కు ఫిట్ చేసింది ఇస్రో. ఉపరితలంతో పాటు 10 సెంటీమీటర్ల దిగువన ఉండే టెంపరేచర్‌నూ గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది.

మూడు రోజుల కిందటే చంద్రుడికి సంబంధించిన తొలి సమాచారాన్ని ఈ పేలోడ్.. ఇస్రోకు పంపించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రయోగించిన తరువాత.. అక్కడి నుంచి అందిన తొలి డేటా అదే. చంద్రుడిపై 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నట్లు నిర్ధారించింది ఈ పేలోడ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+