చన్నీ ఎమ్మెల్యేగానే గెలవడు.. ఇక సీఎం ఎట్ల.. అరవింద్ కేజ్రీవాల్ హాట్ కామెంట్స్

పంజాబ్ ఎన్నికల్లో నేతలు బిజీగా ఉన్నారు. ఓటరు మహా దేవుళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ చేస్తాం.. అదీ చేస్తాం అని కాదు.. నేతల మధ్య వ్యక్తిగత వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఇవాళ ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై చన్నీ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్. తాము సర్వే నిర్వహించామని.. తమ పార్టీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మైనింగ్ స్కామ్ గురించి చన్నీ కామెంట్స్ చేశారు. తమ ప్రమేయం లేదని చెబుతూ.. కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. దీంతో ఆప్ చీఫ్ వెంటనే స్పందించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజల నుంచి టెలిపోల్ ద్వారా అభిప్రాయ సేకరించారు. ఆ ఫలితాలను కేజ్రీవాల్ వెల్లడించారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలవడని స్పష్టంచేశారు. తన సర్వే ద్వారా ఈ విషయం తెలిసిందని.. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు సర్వే చేపట్టానని వివరించారు.

Channi will not become cm as he will not even remain MLA: kejriwal

చంకౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల నుంచి చన్నీ బరిలో దిగుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఆయన ఓడిపోతారని కేజ్రీవాల్ వివరించారు. చన్నీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతే, పంజాబ్ కు ఇంకెవరు సీఎం అవుతారని ప్రశ్నించారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని ప్రకటించిన సంగతి తెలిసిందే. చంకౌర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 52 శాతం ఓట్లు వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. భదౌర్ లో 48 శాతం ఓట్లు లభిస్తాయని చెప్పారు.

ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+