షాకింగ్ వీడియో: మద్యం మత్తులో డ్రైవర్.. జనాలపైకి దూసుకెళ్లిన కారు..
నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఇతరుల ప్రాణాలను సైతం తీస్తున్నారు. పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఇలాంటి ప్రమాదాలు ఆగడం లేదు. మద్యం సేవించి వాహనదారులు రోడ్లపైకి వస్తున్నారు. తోటి వాహనదారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని ఇందిరానగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా నడిపాడు. దాంతో డివైడర్ ను ఢీ కొట్టి ఆవతలి రోడ్డుపైకి దూసుకొచ్చిన కారు అక్కడే ఉన్న జనాల మీదకు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న సీసీటీవీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
A split second from tragedy!!
— Manas Muduli (@manas_muduli) January 10, 2026
A drunk driver in Bengaluru jumped the divider and crashed into a restaurant. Pedestrians missed the speeding car by inches.
One careless choice can cost many innocent lives.
pic.twitter.com/6JYUGkWdnY
బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలోని 100 ఫీట్ రోడ్డుపై ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఆ కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని నడిపాడు. దాంతో కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను బలంగా ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ పైకి దూసుకొచ్చింది. అక్కడే ఉన్న ఆరుగురు టెకీలపైకి దూసుకెళ్లింది. రెప్ప పాటులో వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు రెస్టారెంట్ వద్ద ఉన్న ఇద్దరు జొమాటో డెలివరీ బాయ్స్ కు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. అలాగే ఓ వాహనదారుడు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అర్ధరాత్రి 11 గంటల 35 నిమిషాలకు జరిగింది.

కారు డ్రైవర్ ను డెర్రిక్ టోనీ(42) గా పోలీసులు గుర్తించారు. టోనీని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు జీవన్ బీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఇక ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications