Chattisgarh Assembly election 2023:నామినేషన్ దాఖలు చేసిన సీఎం భూపేష్ భగేల్
Bhupesh Bhagel:ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. సీఎం భూపేష్ భగేల్ దుర్గ్ జిల్లాలోని పటాన్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని భగేల్ వ్యక్తం చేశారు.
దుర్గ్ కలెక్టొరేట్‌లో ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విటర్)లో సీఎం భూపేష్ భగల్ నామినేషన్ దాఖలు చేస్తున్న ఫోటోలను పోస్టు చేశారు. 62 ఏళ్ల భూపేష్ భగేల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ చరన్ దాస్ మహంత్, ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి తమ్రద్వాజ్ సాహులు హాజరయ్యారు. చత్తీస్‌ఘడ్ దేవత ఆశీసులతో తాను పటాన్ నియోజకవర్గంకు నామినేషన్ దాఖలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు.

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే ముందు భూపేష్ భగేల్ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. భూపేష్ భగేల్ భార్య ఆయన నొదుటిపై తిలకం దిద్దే ఫోటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.తన భార్య ముక్తేశ్వరీ తనకు తిలకం దిద్ది పంపినప్పుడల్లా తనకు విజయం లభిస్తుందని రాసుకొచ్చారు భగేల్.తన భార్య ప్రేమం అనంతం అంటూ చెప్పిన భగేల్.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోసం ప్రజల శ్రేయస్సు కోసం నిత్యం సేవ చేస్తానని భగేల్ చెప్పారు.
नाम- भूपेश बघेल
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 30, 2023
विधानसभा क्षेत्र- पाटन
छत्तीसगढ़ महतारी के आशीर्वाद से आज पुनः पाटन विधानसभा क्षेत्र से प्रत्याशी के रूप में नामांकन दाखिल किया है. #फिर_से_कांग्रेस_लाएंगे pic.twitter.com/PwsnBDr2ku
ఇక పటాన్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌తో సరిహద్దు కలిగి ఉంది.ఈ స్థానం నుంచి భగేల్ ఐదు సార్లు విజయం సాధించారు. 1993,1998,2003,2013,2018 అసెంబ్లీ ఎన్నికల్లో భగేల్ విజయదుందుభి మోగించారు. 2008లో తాను తన సోదరుడు బీజేపీ అభ్యర్థి విజయ్ భగేల్ పై ఓటమిపాలయ్యారు. ఈ సారి కూడా బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ విజయ్ భగేల్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ కుర్మీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గం ఛత్తీస్‌ఘడ్ జనాభాలో ఒక్కింత ఎక్కువగానే కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications