చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: విడాకులు వచ్చేశాయి, పెళ్లి చేసుకుందామని యువకుడితో లేడీ ?, బంగారం, లక్షలు స్వాహా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్నాడు. బ్యాచులర్ జీవితం గుడుపుతూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఓ ప్రముఖ మ్యాట్రీమోని వెబ్ సైట్ లో అందమైన మహిళ ఆ యువకుడికి పరిచయం అయ్యింది. తన భర్త తనకు విడాకులు ఇచ్చాడని, నీకు ఇష్టం అయితే మనం పెళ్లి చేసుందామని ఆమె ఆ యువకుడికి చెప్పింది. ఇంతకు ముందే పెళ్లి జరిగి విడాకులు తీసుకున్నా పర్వాలేదు, చాలా అందంగా ఉన్న ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ యువకుడు అనుకున్నాడు. పెళ్లికి ముందే ఇద్దరూ హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేశారు. పాస్ పోర్టుకు దరఖాస్తు చేసిన ఆమె అందులో ఆ యువకుడు తన భర్త అని వివరాలు పొందుపరచింది. తనను భర్తగా అంగీకరించిందని సంతోషం పట్టలేకపోయిన ఆ యువకుడు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు ఆమెకు తీసిచ్చాడు. పెళ్లికి ముందే ఆమె పేరుతో ఓ ఇంటిని కొనుగోలు చేసి ఆమె పేరుతో సేల్ డీడ్ తీసిచ్చాడు. ప్రియురాలి అడగడంతో ఆమెకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడు. ఆ యువకుడు సంపాధిస్తున్న డబ్బు మొత్తం కొన్ని సంవత్సరాలు ఆమెకు తగలేశాడు. క్లైమాక్స్ లో తనకు వేరే పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యిందని, ఇంతకాలం నాతో తిరిగినందుకు నువ్వు చేసిన సహాయం సరిపోయిందని ఆమె హ్యాండ్ ఇవ్వడంతో ఆ యువకుడు హడలిపోయి లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Illegal affair: భర్త కోటీశ్వరుడు, ఆటో డ్రైవర్ తో ఆంటీ జంప్, ఖర్చుల కోసం రూ. 47 లక్షలు, గోల్డ్ !

 ఐటీ హబ్ లో ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం

ఐటీ హబ్ లో ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని నివాసం ఉంటున్న రఘునాథ్ సూరి అలియాస్ రఘునాథ్ ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రఘునాథ్ భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్నాడు. బ్యాచులర్ జీవితం గుడుపుతూ ఎంజాయ్ చేస్తున్న రఘునాథ్ పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు.

 ఎంట్రీ ఇచ్చిన కిలాడి లేడీ

ఎంట్రీ ఇచ్చిన కిలాడి లేడీ

ఓ ప్రముఖ మ్యాట్రీమోని వెబ్ సైట్ లో అందమైన సింధూ నాయుడు అనే మహిళ 2017లో రఘునాథ్ కు పరిచయం అయ్యింది. తరువాత రఘునాథ్, సింధూ నాయుడు స్నేహితులు అయ్యారు. సింధూ నాయుడు నిత్యం రఘునాథ్ కు టచ్ లో ఉంది. తన భర్త తనకు విడాకులు ఇచ్చాడని, నీకు ఇష్టం అయితే మనం పెళ్లి చేసుందామని సింధూ నాయుడు ఆమె బాయ్ ఫ్రెండ్ రఘునాథ్ కు చెప్పింది.

 ఆమె అందం ఎలాగైనా సొంతం చేసుకోవాలని స్కెచ్

ఆమె అందం ఎలాగైనా సొంతం చేసుకోవాలని స్కెచ్

సింధూ నాయుడికి ఇంతకు ముందే పెళ్లి జరిగి విడాకులు తీసుకున్నా పర్వాలేదు, చాలా అందంగా ఉన్న ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని రఘునాథ్ అనుకున్నాడు. పెళ్లికి ముందే సింధూ నాయుడు, రఘునాథ్ విహారయాత్రలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. రఘునాథ్ అతని గర్ల్ ఫ్రెండ్ సింధూ నాయుడు ఇక నా సొంతం అనే రైంజ్ కు వచ్చేశాడు.

 పెళ్లికి ముందే పాస్ పోర్టు కోసం భర్త అని చెప్పింది

పెళ్లికి ముందే పాస్ పోర్టు కోసం భర్త అని చెప్పింది

పెళ్లికి ముందే సింధూ నాయుడు, రఘునాథ్ హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేశారు. పాస్ పోర్టుకు దరఖాస్తు చేసిన సింధూ నాయుడు అందులో ఆ రఘునాథ్ తన భర్త అని వివరాలు పొందుపరిచి ఆ విషయం అధికారులకు చెప్పింది. తనను సింధూ నాయుడు భర్తగా అంగీకరించిందని, ఆమె పాస్ పోర్టులో నా పేరు ఉందని రఘునాథ్ సంతోషం పట్టలేక ఎగిరి గంతేశాడు.

 బంగారు నగలు, లక్షల రూపాయల నగదు స్వాహా

బంగారు నగలు, లక్షల రూపాయల నగదు స్వాహా

సింధూ నాయుడిని చాలాసార్లు జ్యువెలరీ షాపులకు పిలుచుకుని వెళ్లిన రఘునాథ్ ఆమె కొరుకున్న లక్షల రూపాయల విలువైన బంగారు నగలు ఆమెకు తీసిచ్చాడు. పెళ్లికి ముందే లక్ష్లల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన రఘనాథ్ అతని ప్రియురాలు సింధూ నాయుడి పేరుతో ఓ ఇంటిని కొనుగోలు చేసి ఆమె పేరుతో సేల్ డీడ్ తీసిచ్చాడు. ప్రియురాలు సింధూ నాయుడు నోరు తెరచి అడగడంతో ఆమెకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడు. రఘునాథ్ అతను సంపాధిస్తున్న డబ్బు మొత్తం 2017 నుంచి ఇన్ని సంవత్సరాలు సింధూ నాయుడికి తగలేశాడు.

 ఎంజాయ్ చేసినదానికి సరిపోయిందని సారీ చెప్పి చెక్కేసింది

ఎంజాయ్ చేసినదానికి సరిపోయిందని సారీ చెప్పి చెక్కేసింది

ఇటీవల సింధూ నాయుడు ఆమె ప్రియుడు రఘునాథ్ కు భారీ షాక్ ఇచ్చింది. తనకు వేరే పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యిందని, ఇంతకాలం నాతో తిరిగినందుకు నువ్వు చేసిన సహాయం సరిపోయిందని సింధూ నాయుడు కూల్ గా రఘునాథ్ కు చెప్పింది. ఇంతకాలం తనతో ఎంజాయ్ చేసి లక్షల రూపాయల డబ్బుతో పాటు భారీ మొత్తంలో బంగారు నగలు తీయించుకున్న సింధూ నాయుడు హ్యాండ్ ఇవ్వడంతో హడలిపోయిన రఘునాథ్ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేసి లబోదిబో అంటున్నాడు.

 కిలాడీ మేడమ్ ఎస్కేప్

కిలాడీ మేడమ్ ఎస్కేప్

సింధూ నాయుడు ఫోటోలు, ఆమె వివరాలు తెలుసుకున్న హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్న కిలాడీ లేడి కోసం గాలిస్తున్నారు. సుమారు నాలుగు సంవత్సరాలు రఘునాథ్ సంపాదించిన డబ్బులో భారీ మొత్తంలో దోచుకున్న కిలాడీ లేడీ సింధూ నాయుడి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. రఘునాథ్ కు కుచ్చుటోపి పెట్టిన సింధూ నాయుడు పక్క రాష్ట్రానికి పారిపోయిందని బెంగళూరు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
Cheating lady: A woman allegedly cheated a private company employee in the name of marriage in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X