Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cheating: స్వామి పూజ పేరుతో స్వాహా, మహిళకు మళయాలం సినిమా స్టోరీ చెప్పి ? !

బెంగళూరు/చిక్కమగళూరు: మీసమస్యలు పరిష్కరిస్తామని, మీరు ఎంతదూరంలో ఉన్నా మీ పేరు, మీ రాశిఫలాలు, నక్షత్రం, జాతకం ఆధారంగా మీ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని ఓ జ్యోతిష్యుడు ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. జ్యోతిష్యుడి ప్రకటనలు చూసిన ఓ మహిళ మా ఇంట్లో సమస్యలు పరిష్కరించాలని అతన్ని సంప్రధించింది. మొదట పూజల కోసం రూ. 7 వేలు తీసుకున్న జ్యోతిష్యుడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. రానురాను పూజల పేరుతో లక్ష రూపాయలతో పాటు ఫ్యాన్సీ నెంబర్ ఫిగర్ డబ్బులు వసూలు చేశాడు. తరువాత మీ జాతకం తారుమారు అయ్యిందని, మీకు ఇంకా కొన్ని పూజలు చెయ్యాలని ఆమెకు మళయాలం సినిమా స్టోరీ చెప్పాడు. అప్పటికే అనేక సమస్యలతో విసిగిపోయిన మహిళకు మండిపోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

 ఫేస్ బుక్ లో ప్రకటనలు

ఫేస్ బుక్ లో ప్రకటనలు

బెంగళూరు సిటీలో గణేష్ గొందళే అలియాస్ గణేష్ గురూజీ అనే జ్యోతిష్యుడు నివాసం ఉంటున్నాడు. మీసమస్యలు పరిష్కరిస్తామని, మీరు ఎంతదూరంలో ఉన్నా మీ పేరు, మీ రాశిఫలాలు, నక్షత్రం, జాతకం ఆధారంగా మీ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని జ్యోతిష్యుడు గణేష్ గురూజీ ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు.

 సమస్యలతో సతమతం

సమస్యలతో సతమతం

కర్ణాటకలోని చిక్కమగళూరులో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళ గణేష్ గురూజీ ప్రకటనలు చూసింది. ఫేస్ బుక్ లోని నెంబర్ కు ఫోన్ చేసిన మహిళ గణేరష్ గురూజీతో మాట్లాడింది. మహిళ చెప్పిన సమాచారం తెలుసుకున్న గణేష్ గురూజీ ఆమె అనేక సమస్యలతో సతమతం అవుతోందని, ఆమెను బుట్టలో వేసుకోవాలని స్కెచ్ వేశాడు.

 అక్షరాలా రూ. 1, 16, 001 వసూలు

అక్షరాలా రూ. 1, 16, 001 వసూలు

బెంగళూరు జ్యోతిష్యుడు గణేష్ గురూజీ ప్రకటనలు చూసిన చిక్కమగళూరు మహిళ మా ఇంట్లో సమస్యలు పరిష్కరించాలని అతనికి మనవి చేసింది. మొదట పూజల కోసం రూ. 7 వేలు తీసుకున్న జ్యోతిష్యుడు గణేష్ గురుజీ తరువాత ఆమెకు ఇంకా పూజలు చెయ్యాలని విడతలు విడతలుగా రూ. 1, 16,001 రూపాయలు వసూలు చేశాడు.

 ఫ్యాన్సీ నెంబర్ డబ్బులు లాగేసిన గురూజీ

ఫ్యాన్సీ నెంబర్ డబ్బులు లాగేసిన గురూజీ

బెంగళూరులో ఉంటూనే గణేష్ గురూజీ చిక్కమగళూరు మహిళ దగ్గర ఫ్యాన్సీ నెంబర్ ఫిగర్ డబ్బులు వసూలు చేశాడు. మీ జాతకం తారుమారు అయ్యిందని, మీకు ఇంకా కొన్ని పూజలు చెయ్యాలని చిక్కమగళూరు మహిళకు మళయాలం సినిమా స్టోరీ చెప్పిన గణేష్ గురూజీ ఇంకా ఆమె దగ్గర డబ్బులు వసూలు చెయ్యాలని ప్రయత్నించాడు.

 గురూజీ కాదు...... నకిలీ జ్యోతిస్యుడు

గురూజీ కాదు...... నకిలీ జ్యోతిస్యుడు

అప్పటికే అనేక సమస్యలతో విసిగిపోయిన మహిళ గురూజీ వేధింపులు తట్టుకోలేక విసిగిపోయింది. పదేపదే ఫోన్లు చేసిన గణేష్ గురూజీ మీరు సరైన సమయంలో పూజలు చెయ్యకపోతే ఇంకా ఇబ్బందులు వస్తాయని ఆమెను బెదిరించాడు. మహిళకు ఎక్కడో మండిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోవాలి

ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోవాలి

పోలీసులు గణేష్ గురూజీని అదుపులోకి తీసుకున్నారు. గణేష్ గురూజీ అసలు జ్యోతిష్యుడు కాదని, అతను నకిలీ జ్యోతిష్యుడు అని, అసలు పూజలు చెయ్యలేదని తెలుసుకున్న చిక్కమగళూరు పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ముక్కుముఖం తెలియని గురూజీలకు డబ్బులు ఇస్తే ఇలాగే మోసం చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+