Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cheating: ప్రియురాలికి భార్య, బిడ్డలను గిఫ్ట్ గా ఇచ్చిన కేటుగాడు, రూ. లక్షలు స్వాహా, సీన్ కట్ చేస్తే !

చెన్నై/బెంగళూరు: కంపెనీలో కలిసి పని చేస్తున్న యువకుడితో యువతికి పరిచయం అయ్యింది. ప్రతిరోజు ఒకేచోట పని చేస్తున్న యువతి యువకుడు టీలకు, టిఫిన్లకు, భోజనాలకు బయటకు వెళ్లి రావడంతో ఇద్దరికి చనువు ఏర్పడింది. మంచి రోజు చూసి ఐ లవ్ యూ చెప్పిన యువకుడు ఆమెను లొంగదీసుకున్నాడు. కొంతకాలం ప్రేమికులుగా తిరిగారు తరువాత అమ్మాయి కుటుంబ సభ్యులను నచ్చచెప్పి పెళ్లి చేసుకోవడానికి వారి దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.

అమ్మాయి బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఇంకా టైమ్ ఉండటంతో తనకు డబ్బు అవసరంగా ఉందని కేటుగాడు కాబోయే భార్యకు మాయమాటలు చెప్పాడు. ఒకేసారి మూడు లక్షలు అతని అకౌంట్ కు బదిలి చేసిన యువతి కాభోయే భర్త కదా సహాయం చేద్దాం అనుకుంది. తరువాత తనకు కాభోయే భర్తకు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, భార్య, పిల్లలు ఉన్నారని తెలుసుకున్న యువతి షాక్ అయ్యింది. అమ్మాయికి కుచ్చుటోపీ పెట్టిన కేటుగాడు అతని భార్య, పిల్లలతో ఎస్కేప్ కావడం కలకలం రేపింది.

 చెన్నైలో ఇద్దరూ నివాసం

చెన్నైలో ఇద్దరూ నివాసం

చెన్నైలోని అవడి సమీపంలోని వెల్లనూర్ ప్రాంతంలోని ప్రయదర్శిని కాలనీలో 26 సంవత్సరాల వయసు ఉన్న రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. చెన్నైలెని అరుంబక్కంలోని తిరువేడి అమ్మాన్ కోవిల్ వీధిలో నివాసం ఉంటున్న బెనాడ్రియన్ అనే యవకుడు నివాసం ఉంటున్నాడు.

 ఒకే కంపెనీలో ఉద్యోగాలు

ఒకే కంపెనీలో ఉద్యోగాలు

రంజిత, బెనాడ్రియన్, రంజిత చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే కంపెనీలో కలిసి పని చేస్తున్న బెనాడ్రియన్, రంజిత అనే యువతికి పరిచయం అయ్యింది. ప్రతిరోజు ఒకేచోట పని చేస్తున్న రంజిత, బెనాడ్రియన్ టీలకు, టిఫిన్లకు, భోజనాలకు బయటకు వెళ్లి రావడంతో ఇద్దరి మద్య చనువు ఏర్పడింది.

ఐ లవ్ యూ చెప్పిన కేటుగాడు

ఐ లవ్ యూ చెప్పిన కేటుగాడు

మంచి రోజు చూసిన బెనాడ్రియన్ సాటి ఉద్యోగి రంజితకు ఐ లవ్ యూ చెప్పాడు. తరువాత రంజితన అతను లొంగదీసుకున్నాడు. కొంతకాలం రంజిత, బెనాడ్రియన్ ప్రేమికులుగా కలిసి మెలసి సంతోషంగా సినిమాలు, షికార్లకు తిరిగారు తరువాత రంజిత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి పెళ్లి చేసుకోవడానికి వారి దగ్గర రంజిత, బెనాడ్రియన్ గ్రీన్ సిగ్నల్ తీసుకుకున్నారు.

 నిశ్చితార్థం.....ఒకేసారి మూడు లక్షలు స్వాహా

నిశ్చితార్థం.....ఒకేసారి మూడు లక్షలు స్వాహా

గత ఏడాది నవంబర్ 20వ తేదీన రంజిత, బెనాడ్రియన్ నిశ్చితార్థం జరిగింది. రంజిత బంధువుల సమక్షంలో మాత్రమే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి బెనాడ్రియన్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరుకాలేదు. పెళ్లికి ఇంకా టైమ్ ఉండటంతో తనకు డబ్బు అవసరంగా ఉందని కేటుగాడు బెనాడ్రియన్ కాబోయే భార్య రంజితకు మాయమాటలు చెప్పాడు. ఒకేసారి మూడు లక్షల రూపాయలను రంజిత అతని అకౌంట్ కు బదిలి చేసింది. కాభోయే భర్త కదా సహాయం చేద్దాం అని రంజిత అనుకుంది.

 ప్రియురాలికి భార్య, బిడ్డలను గిఫ్ట్ గా ఇచ్చాడు

ప్రియురాలికి భార్య, బిడ్డలను గిఫ్ట్ గా ఇచ్చాడు

కొంతకాలం తరువాత పెళ్లికి సర్వం సిద్దం చేసుకుంటున్న రంజితకు షాకింగ్ విషయం తెలిసింది. బెనాడ్రియన్ కు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, భార్య, పిల్లలు ఉన్నారని స్నేహితుల ద్వారా రంజితకు తెలిసింది. తనకు అన్యాయం చేశాడని రంజిత బెనాడ్రియన్ మీద ఏప్రిల్ 13వ తేదీన అరుంబక్కాం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

 లక్ష ఇచ్చి చెక్కేసిన కేటుగాడు

లక్ష ఇచ్చి చెక్కేసిన కేటుగాడు

పోలీసులు బెనాడ్రియన్ ను పలిపించి బెండ్ తీశారు. ఆ సమయంలో మూడు లక్షలు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన బెనాడ్రియన్ అప్పుడు రంజితకు రూ. 1 లక్ష ఇచ్చేశాడు. మిగిలిన 2 లక్షల డబ్బులు అడిగితే నీ మీద యాసిడ్ పోస్తానని, నిన్ను చంపేస్తానని బెదరిస్తున్నాడని రంజిత మరోసారి పోలీసు కేసు పెట్టింది. పోలీసులు వెళ్లి చూడగా బెనాడ్రియన్ ఇల్లు ఖాళీ చేసి అతని భార్య, పిల్లలతో కలిసి మాయం అయిపోయాడని వెలుగు చూసింది. పెళ్లి పేరుతో అమాయకులైన అమ్మాయిలను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న బెనాడ్రియన్ కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు.

6. అందుకేనా

లక్ష ఇచ్చి చెక్కేసిన కేటుగాడు

పోలీసులు బెనాడ్రియన్ ను పలిపించి బెండ్ తీశారు. ఆ సమయంలో మూడు లక్షలు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన బెనాడ్రియన్ అప్పుడు రంజితకు రూ. 1 లక్ష ఇచ్చేశాడు. మిగిలిన 2 లక్షల డబ్బులు అడిగితే నీ మీద యాసిడ్ పోస్తానని, నిన్ను చంపేస్తానని బెదరిస్తున్నాడని రంజిత మరోసారి పోలీసు కేసు పెట్టింది. పోలీసులు వెళ్లి చూడగా బెనాడ్రియన్ ఇల్లు ఖాళీ చేసి అతని భార్య, పిల్లలతో కలిసి మాయం అయిపోయాడని వెలుగు చూసింది. పెళ్లి పేరుతో అమాయకులైన అమ్మాయిలను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న బెనాడ్రియన్ కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు. బెనాడ్రియన్ ఫ్యామిలీతో పాటు చెన్నై సిటీ వదిలిపారిపోవడంతో ఇంతకాలం అతనితో టచ్ లో ఉన్న యువకులు హడలిపోతున్నారు. పోలీసులు ఎక్కడ వచ్చి మమ్మల్ని విచారణ చేసి కేటుగాడి అడ్రస్ అడుగుతారో అంటూ హడలిపోతున్నారని సమాచారం. మరో వైపు బెనాడ్రియన్ ఎక్కడ వివాహం చేసుకున్నాడు, అతను చెన్నై వదిలి ఎక్కడికి వెళ్లాడు, ఇంకా ఎంతమందని ఇలా ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు అని చెన్నై సిటీ పోలీసులు మొత్తం కూపీలాగుతున్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+