బి అలర్ట్: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవుల జాబితా ఇదే
Bank holiday in September 2024: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయిపోయాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.
తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. అలాంటి బ్యాంకులు ఒక్క రోజు మూత పడినా వందల కోట్ల రూపాయల మేర కార్యకలాపాలు స్తంభించిపోతుంటాయి. సాధారణ సెలవు రోజులను మినహాయిస్తే.. సమ్మెలు, బంద్‌లల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తుంటుంది.

కాగా- బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలా చివరి వారంలో జారీ చేస్తుంటుంది. ఈ సారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించింది. సెప్టెంబర్ నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవురోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను విడుదల చేసింది.
సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది.
రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు మొత్తం 14 సెలవులను రానున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ- ఆదివారం. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకేసారి అమలవుతుంది. సెప్టెంబర్ 7వ తేదీ- వినాయక చవితి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గల బ్యాంకులకూ ఒకేసారి సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 8వ తేదీ- ఆదివారం సెలవు. అదే రోజు ఒడిశాలో జరుపుకొనే నువాఖాయ్ పండగ కూడా. సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం రామ్‌దేవ్ జయంతి/తేజ దశమిని పురస్కరించుకుని రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
14వ తేదీన ఓనం పర్వదినం. మలయాళీలకు ప్రధాన పండగ. కేరళతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులకు సెలవు ఉంటుంది. 15వ తేదీన ఆదివారం. 16వ తేదీన ఈద్-ఇ-మిలద్. అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 17వ తేదీన ఇంద్ర జాత్రను పురస్కరించుకుని సిక్కింలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
18వ తేదీ- శ్రీ నారాయణగురు జయంతి పొందిన రోజు కావడం వల్ల కేరళలో బ్యాంకులకు హాలిడేను ప్రకటించింది రిజర్వుబ్యాంక్. 21వ తేదీ నారాయణగురు జీవసమాధి పొందిన రోజు కావడం వల్ల సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 22వ తేదీ-ఆదివారం హాలిడే. 23వ తేదీ అమరవీరుల సంస్మరణ రోజు కావడం వల్ల హర్యానాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
28వ తేదీన నాలుగో శనివారం, 29వ తేదీన ఆదివారం హాలిడే. ఆయా సెలవు రోజులను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు తమ కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు సూచించింది.












Click it and Unblock the Notifications