శభాష్ ఖాకీ: గాయపడ్డ వ్యక్తిని భుజాన మోసుకెళ్లిన మహిళ ఎస్ఐ, వీడియో వైరల్
పోలీసులంటే ఎందుకో భయం. అంటే వాళ్లు మంచి తక్కువ బెదిరించడం, భయపెట్టడమే ఉంటాయని అంటారు. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పిన.. మరికొన్ని చోట్ల అభద్రతా భావం ఉంటుంది. ఎందుకంటే వారు కఠువుగా ఉంటారని.. అర్థం చేసుకోరని అంతా అంటారు. వాస్తవానికి అది నిజం కూడా.. కానీ కొందరు మాత్రం అలా కాదు. అవును తాము పోలీసులం అనే మాట మరచిపోతారు. నిజం.. తమలోని మానవత్వాన్ని ప్రపంచానికి చూపిస్తుంటారు. ఇదివరకు చాలా సందర్భాల్లో ఇలానే జరిగింది. ఇప్పుడు అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

చెట్టు కూలీ
ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్నాయి. వర్షానికి తోడు ఈదురుగాలులతో కరెంట్ స్తంభాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఆ సమయంలో ఓ యువకుడు అక్కడే ఉన్నాడు. ఇంకేముంది ఓ చెట్టు కొమ్మలు అతనిపై పడ్డాయి. దీంతో గాయపడి.. సృహ కూడా కోల్పోయాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిలో అన్నానగర్ ఎస్ఐ రాజేశ్వరి ఉన్నారు. అతనికి వెంటనే సాయం చేయాలని అనుకున్నారు. తన తోటి సిబ్బంది సాయం చేయగా.. భుజంపై వేసుకున్నారు. అలా వాహనం వద్దకు తీసుకెళ్లి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్.. ఎస్ఐ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

భుజాన వేసుకొని
రాజేశ్వరితోపాటు మిగతా ఖాకీలు అక్కడే ఉన్నారు. ఆమె యువకుడిని తన భుజాన వేసుకుని ముందుకు నడిచింది. తమ పోలీసు వాహనంలో పడుకునే ప్రయత్నం చేశారు. కానీ వీలు కాలేదు. ఆటోలో అయితే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే ఆటో వద్దకు పరుగుతీసింది. ఆటోలో బెడ్ షీట్ వేశాక.. అతనిని పడుకొబెట్టింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. సరైన సమయంలో తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ ఎస్ఐ చేసిన మంచి పనిని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వావ్ అంటూ కీర్తిస్తున్నారు.

రాజేశ్వరి మాదిరిగా
సాధారణంగా పోలీసులు అంటే కఠినంగా ఉంటారని అంతా అంటారు. అదీ నిజమే.. ఎందుకంటే స్టేషన్‌కు వచ్చేవారితో వారు అలానే బిహెవ్ చేస్తారు. కొందరు మాత్రమే రాజేశ్వరి ఎస్ఐ మాదిరిగా ప్రవర్తిస్తారు. తాము కూడా మనుషులమే అని రుజువు చేస్తారు. మరికొందరు మాత్రం రెచ్చిపోతుంటారు. అలా కొందరు చేసే ప్రవర్తనతో డిపార్ట్ మెంట్‌కు చెడ్డపేరు వస్తోంది. సో మనం కూడా మిగతా వారు కూడా రాజేశ్వరి మాదిరిగా ప్రవర్తించాలని కోరుకుందాం. అప్పుడు అంతటా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిజంగా అమలవుతోంది.
ఫ్రెండ్లీ పోలీసింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతోంది. ఇప్పుడు స్టేషన్‌కు తీసుకెళ్లి.. కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే లాకప్ డెత్ కూడా జరగడం లేదు. ఇదీ ఒక విధంగా మన మంచికే జరుగుతుంది. మిగతా వారు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా మనలో ఒకరే అనుకునే పరిస్థితి సమాజంలో అభిప్రాయం వస్తోంది.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
ఏపీలో ఆ జిల్లాల్లో పెనం మీద ఉన్నట్టే- అత్యధిక ఉష్ణోగ్రత -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications