కబాలి స్టైల్లో రౌడీ బర్త్ డే పార్టీ: నటి, తమ్ముడితో స్మగ్లింగ్, తిరుపతి లాయర్, ఖైమా కత్తి!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Rajinikanth Kabali Scene in Real Life, Must Watch

  చెన్నై: చెన్నై నగరాన్ని గడగడలాడించిన రౌడీషీటర్ బిను కోసం పోలీసులు సేలం, ఈరోడ్, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. తమిళనాడు నుంచి బిను తప్పించుకోకుండా పోలీసులు జాగ్రతలు తీసుకుంటున్నారు. తాజాగా రౌడీషీటర్ బిను వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ సినీనటి, ఆమె తమ్ముడి సహాయంతో బిను గంధపుచెక్కల స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తిరుపతికి చెందిన ఓ న్యాయవాది బినుకు సహాయం చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

  కైమాకత్తితో బర్త్ డే పార్టీ

  కైమాకత్తితో బర్త్ డే పార్టీ

  మంగళవారం అర్దరాత్రి బిను చెన్నైనగర శివార్లలోని ఓ ప్రాంతంలో కైమా కత్తితో కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ జరుపుకున్నాడు. బిను 40 గోర్రెలు తీసుకు వచ్చి వంటలు చేయించి చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరుకు చెందిన రౌడీషీటర్లను ఆహ్వానించి బిరియానీలు చేయించి మందు, విందు పార్టీలు ఇచ్చాడు.

  తిరపతి లాయర్

  తిరపతి లాయర్

  బిను బర్త్ డే పార్టీ మీద మెరుపుదాడి చేసిన పోలీసులు 72 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసినట్లు ఉన్న ఓ గుర్తింపు కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎం. శరవణ, న్యాయవాది, తిరుపతి అనే చిరునామాతో పాటు అతని ఫోటో ఉంది.

  మీడియా కార్డు

  మీడియా కార్డు

  అదే సందర్బంలో ఎం. శరవణ పేరు, ఫోటోతో లీగల్ అడ్వకేట్, మీడియా అనే మరో గుర్తింపు కార్డు ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరవణను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిజంగా శరవణకు గుర్తింపు కార్డు ఇచ్చిందా, లేకపోతే నకిలీనా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

  సినీనటి తమ్ముడు

  సినీనటి తమ్ముడు

  బినుతో పాటు తప్పించుకుని పారిపోయిన 50 మందిలో పాతనేరస్తుడు, ప్రముఖ సినీనటి తమ్ముడు ఉన్నాడని పోలీసులు అంటున్నారు. అంతే కాకుండా అరెస్టు అయిన 72 మందిలో 20 మంది కాలేజ్ విద్యార్థులు ఉన్నారని, వీరు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

  సినీనటి అండతో స్మగ్లింగ్ !

  సినీనటి అండతో స్మగ్లింగ్ !

  ప్రముఖ నటి, ఆమె తమ్ముడి సహకారంతో బిను గంధపుచెక్కల స్మగ్లింగ్ చేస్తున్నాడని అతని అనుచరులు సమాచారం ఇచ్చారని పోలీసులు అంటున్నారు. ఈ విషయంలో నటి తమ్ముడు చిక్కిన తరువాత విచారణ ముమ్మరం చేస్తామని పోలీసులు చెప్పారు.

  హోటల్స్, లాడ్జ్ లు

  హోటల్స్, లాడ్జ్ లు

  తమిళనాడులోని సేలం, ఈ రోడ్, కోయంబత్తూరు, ఊటి తదితర ప్రాంతాల్లోని అన్ని హోటళ్లు, లాడ్జిలు మొత్తం పరిశీలిస్తున్నారు. బిను ఎక్కడ తలదాచుకున్నా వదిలిపెట్టకూడదని చెన్నై పోలీసులు నిర్ణయించారు. అరెస్టు అయిన రౌడీలను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.

  పోటీగా రౌడీషీటర్లు

  పోటీగా రౌడీషీటర్లు


  తనకు పోటీగా ఎదుగుతున్న రౌడీషీటర్లు రాధాక్రిష్ణన్, సెంథిల్ ను బర్త్ డే పార్టీకి ఆహ్వానించిన బిను అక్కడే వారిని హత్య చెయ్యాలని పక్కాప్లాన్ వేశాడు. అయితే అనుమానం రావడంతో రాధాక్రిష్ణన్, సెంథిల్ బిను బర్త్ డే పార్టీకి వెళ్లలేదని, అందుకే ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rowdy Binu Plans to kill rowdy Radha kirshnan and another rowdy in the birthday function. But Radhakirshnan and another rowdy knows this and escapped luckily.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి