దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

స్వాతి హత్య: గొంతుకోసింది పోలీసులేనని రామ్‌కుమార్ తండ్రి సంచలనం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా స్వాతి హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు రామ్‌కుమార్ అమాయకుడని, పోలీసులే అతని గొంతు కోశారని పరమశివమ్ ఆరోపించారు.

  నుంగంభక్కమ్ రైల్వే స్టేషన్‌లో జూన్ 24న స్వాతిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జులై 1న రాత్రి తిరునల్వేలికి చెందిన నిందితుడు రామ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జైలులోనే ఉన్నాడు.

  స్వాతి పిలిస్తేనే చెన్నైకి వచ్చా: వైరల్‌గా రామ్‌కుమార్-స్వాతిల ఫొటో?

  కాగా, తన కుమారుడు రామ్ కుమార్ సాధారణంగానే జూన్ 25న రాత్రి చెన్నై నుంచి తిరునల్వేలి జిల్లాలోని టి మినాక్షిపురంలోని తమ ఇంటికి వచ్చాడని అతని తండ్రి తెలిపాడు. జులై 1న తమ ఇంటికి వచ్చిన ఇద్దరు పోలీసులు ముత్తు కుమార్ గురించి అడిగారని చెప్పాడు. ఇక్కడ ముత్తుకుమార్ ఎవరూ లేరని తన కూతురు వారితో చెప్పిందని తెలిపాడు టెంకాశీలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో పని చేసే పరవశివన్.

  Chennai techie murder: Ramkumar's father claims cops cut his son's throat

  స్వాతిని చంపింది తానేనని తిరునల్వేలి ఆస్పత్రిలో రామ్ కుమార్ ఒప్పుకున్నాడు కదా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. 'పోలీసులే నా కొడుకు గొంతు కోశారు. గొంతుకోసినా అతడు తన వాంగ్మూలాన్ని ఎలా ఇవ్వగలడు' ప్రశ్నించాడు.

  స్వాతి హత్యకు తన కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని రామ్ కుమార్ తండ్రి పేర్కొన్నాడు. తన ఇంటి నుంచి కొడుకును తీసుకెళ్లి పోలీసులే గొంతుకోశారని, తాను వెళ్లి చూసేసరికి పోలీసులు చేతుల్లో తన కొడుకు రక్తపు మడుగులో ఉన్నాడని చెప్పాడు. ఒక వేళ తన కొడుకు చనిపోతే శవాన్ని తనకు ఇచ్చేవారని వాపోయాడు. తన కొడుకు అమాయకుడని, అతను హత్య చేయలేడని తెలిపాడు. పోలీసులే తన కొడుకును ఈ కేసులో ఇరికించారని తెలిపాడు.

  తన కొడుకు విడుదల కోసం తాను ఏ న్యాయవాదిని పెట్టుకోలేదని చెప్పాడు. మొదట తన కొడుకు తరపున వాదించేందుకు వచ్చిన కృష్ణమూర్తి కూడా తనకు తెలియదని పరమశివమ్ తెలిపాడు. ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగానే ఉన్నాడని, ఒక హత్య చేసిన వ్యక్తి అలా ఎందుకు ఉంటాడని ప్రశ్నించాడు.

  'నా కొడుకును వేరెవరో అనుకుని అరెస్ట్ చేసివుంటారు. కోర్టు నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో పోలీసులు తన కొడుకును నిందితుడిగా ఇరికించారు' అని ఆయన తెలిపాడు. షెంగొట్టాయి ఇన్‌స్పెక్టర్ బాలమురుగన్, తిరునల్వేలి పోలీస్ సూపరింటెండెంట్ విక్రమన్ మాట్లాడుతూ.. ఇలాంటి సంచలన హత్య కేసులో అనేక ఆరోపణలు వస్తుంటాయని అన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు తాము చెన్నై పోలీసులకు సహకరించామని తెలిపారు. చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున దీనిపై ఇంకా ఎక్కువ మాట్లాడలేమని చెప్పారు.

  English summary
  “My son is innocent…We are being targeted just because we are Dalits”, said Paramasivam, the father of techie Swathi murder accused Ramkumar, hitting out at the police investigating the June 24 slaying on the Nungambakkam railway platform. Going a step further, he accused the police of cutting his son’s throat “to prevent him from speaking out”.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more