Doctor: ఆసుపత్రిలో డాక్టర్ ను కత్తులతో పొడిచేసి ?, సీసీటీవీల్లో షాకింగ్ మ్యాటర్, రౌడీషీటర్ ఎఫెక్ట్ తో ?
చెన్నై/కాంచీపురం: చిన్నప్పటి నుంచి స్కూల్ లో కొందరు స్నేహితులు కలిసి చదువుకున్నారు. వారిలో ఇద్దరు అబ్బాయిలు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఓ అబ్బాయిలో కాలేజ్ లో చేరి డాక్టర్ అయ్యాడు. సొంతంగా క్లీనిక్ పెట్టుకున్న డాక్టర్ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. డాక్టర్ చిన్ననాటి స్నేహితుడు రౌడీయిజం చేస్తూ మద్యం, గంజాయి సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. తరువాత ఇద్దరూ కలుసుకోవడం మొదలుపెట్టారు. తరువాత రౌడీషీటర్ అసలు కథ మొదలుపెట్టాడు. సీసీటీవీల్లో షాకింగ్ సమాచారం చిక్కడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

సొంతంగా క్లీనిక్
తమిళనాడులోని చెన్నై సమీపంలోని కాంచీపురం జిల్లా కుంరత్తూరు పక్కనే ఉన్న పాలంతండలం ప్రాంతానికి చెందిన గౌతమ్( 26) అనే యువకుడు డెంటిస్ట్. బాగా చదువుకుని పండ్ల డాక్టర్ అయిన గౌతమ్ తిరుముడివాక్కం ప్రాంతంలో సొంతంగా డెంటల్ క్లినిక్ నడుపుతున్నాడు. గత డిసెంబర్ నెల చివరి వారంలో గౌతమ్ ఆస్పత్రిలో ఉంన్నాడు. ఆ సందర్బంలో దుండగులు డెంటల్ క్లీనిక్ లోచి చొరబడి డాక్టర్ గౌతమ్ ను కత్తులతో పొడిచి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

ప్రాణాలతో భయటపడిన డాక్టర్
తీవ్రగాయాలైన డాక్టర్ గౌైతమ్ ఆసుపత్రిలో చేరాడు. అదృష్టవశాత్తూ గౌతమ్ ప్రాణాలతో బయటపడ్డాడు. గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుంరత్తూరు పోలీసులు డాక్టర్ మీద హత్యాయత్నం చేసిన నిందితుల కోసం గాలించారు. గౌతమ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి నిందితుల కోసం గాలించారు.

చిన్ననాటి ఫ్రెండ్స్
ఈ కేసులో పాలంతండలానికి చెందిన ప్రముఖ రౌడీ సెంథిల్ సెల్వన్ (26), అతనికి సహకరించిన కరుణాకరన్ అలియాస్ గంజా కర్ణ (21)తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంథిల్ సెల్వన్, డాక్టర్ గౌతమ్ ఇద్దరూ ఒకే స్కూల్‌లో చిన్నప్పటి నుంచి చదువుకున్నారని, కాలేజ్ వరకు ఇద్దరూ స్నేహితులని పోలీసులు చెప్పారు.

గంజాయి, మద్యం కోసం డబ్బులు డిమాండ్
గౌతమ్ బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడని సెంథిల్ సెల్వన్ జులాయిా తిరుగుతూ రౌడీ అయ్యి గంజాయి, మద్యం సేవిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇటీవల కాలంలో సెల్వన్ అతని స్నేహితుడు డాక్టర్ గౌతమ్ కు డబ్బులు ఇవ్వాలని ఎక్కువగా టార్చర్ పెట్టాడని, డబ్బులు ఇవ్వడానికి గౌతమ్ నిరాకరించాడని పోలీసులు అన్నారు, గౌతమ్ ను బెదిరించాలని ఇంతకు ముందే సెల్వన్ కత్తులతో బెదిరించాడని, చివరికి డాక్టర్ గౌతమ్ ను సెంథిల్ హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి గౌతమ్ ను హత్య చెయ్యడానికి ఉపయోగించిన కత్తి, బైక్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications