Chennai: భర్తను చంపి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భార్య, నా మొగుడికి అందుకే పోయేకాలం !
చెన్నై/ రాణిపేట్: దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టెంట్ హౌస్ తో పాటు సౌండ్ పార్టీ బ్యాండ్ లు అద్దెకు ఇస్తున్న భర్త డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించిన భర్త తరువాత ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భార్యను పట్టుకుని చితకబాదేశాడు. పక్కరూమ్ లో పిల్లలు ఉన్నా భర్త ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ సందర్బంలో గొడవ పెద్దది అయ్యింది. భర్త కొట్టే దెబ్బల నుంచి తప్పించుకోవాలని భార్య అనేక ప్రయత్నాలు చేసింది. అయితే క్లైమాక్స్ లో రోకలి చేతిలోకి తీసుకున్న భార్య ఆమె భర్త తలను కొబ్బరి ఛట్నీ చేసినట్లు నుజ్జునుజ్జు చేసి దారుణంగా చంపేసింది.

వ్యాపారం చేస్తున్న భర్త
తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని అరకోణం సమీపంలోని ఉరియూరులో సిరాలన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శోభన అనే యువతిని సిరాలన్ వివాహం చేసుకున్నాడు. సిరాలన్, శోభన దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సొంతఊరిలోనే సిలారన్ టెంట్ హౌస్ తో పాటు సౌండ్ పార్టీ బ్యాండ్ లు అద్దెకు ఇస్తున్నాడు.

భర్తకు రోజూ లిక్కర్ పార్టీలు
టెంట్ హౌస్ నిర్వహిస్తున్న సిలారన్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించిన సిలారన్ తరువాత ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో సిలారన్ అతని భార్య శోభన మీద చిందులు వేశాడు. ఆ సందర్బంలో రెచ్చిపోయిన సిలారన్ అతని భార్య శోభనాను పట్టుకుని చితకబాదేశాడు.

భార్య కేకలు వేసినా పట్టించుకోలేదు
పక్కరూమ్ లో కూతురు, కొడుకు ఉన్నారని కూడా పట్టించుకోని సిలారన్ రెచ్చిపోయాడు. ఆ సందర్బంలో సిలారన్, శోభనాల మద్య గొడవ పెద్దది అయ్యింది. సిలారన్ కొట్టే దెబ్బల నుంచి తప్పించుకోవాలని శోభనా గట్టిగా కేకలు వేసింది. అయితే ఎప్పుడు సిలారన్, శోభనాల మద్య ఉండే గొడవలే కదా అంటూ స్థానికులు, బంధువులు పెద్దగా పట్టించుకోలేదు.

భర్తను చంపేసి పుట్టింటికి వెళ్లిన భార్య
సిలారన్ రెచ్చిపోవడంతో సహనం కోల్పోయిన శోభనా ఇంట్లో ఉన్నరోకలి చేతిలోకి తీసుకుని ఆమె భర్త తలను కొబ్బరి ఛట్నీ చేసినట్లు నుజ్జునుజ్జు చేసి దారుణంగా చంపేసింది. భర్త సిలారన్ ను హత్య చేసిన శోభనా ఇంటి బయట తాళం వేసి ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లి కూతురు, కొడుకును ఆమె చెల్లికి అప్పగించింది.

నా మొగుడికి అందుకే పోయేకాలం
మరుసటి రోజు ఉదయం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శోభన తన భర్తను చంపేశానని మ్యాటర్ మొత్తం చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. తన భర్త సిలారన్ కు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమె మోజులో పడి తనను, తన పిల్లలను చితకబాదుతూ చిత్రహింసలు పెడుతున్నాడని శోభనా పోలీసులకు చెప్పింది.












Click it and Unblock the Notifications