నోరు జారిన రాహుల్ గాంధీ: సొంత పార్టీ సీఎంపై షాకింగ్ కామెంట్స్

రాయ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న రాష్ట్రాల్లో ప్రచార జోరును కొనసాగిస్తున్న
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి నోరు జారారు. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో ఆయన సొంత పార్టీ సీఎంను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనపై బీజేపీ తనదైన శైలిలో విమర్శలు సంధిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అదానీ గ్రూపును ప్ర‌స్తావించిన కాంగ్రెస్ నేత రాహుల్.. కేంద్ర ప్ర‌భుత్వం పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అనుకూలంగా ప‌నిచేస్తోంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే నోరు జారారు రాహుల్. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. సీఎం భూపేశ్ బఘేల్ (Bupesh baghel) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్త అదానీ కోసం పనిచేస్తుందని అన్నారు.

Chhattisgarh CM Bhupesh Baghel works for Adani: Rahul Gandhi makes embarrassing comments

'మీరు (బీజేపీని ఉద్దేశించి) 24/7 అదానీ కోసం పనిచేస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసమే పనిచేస్తారు. మేము రైతులు, కూలీలు, చిరు వ్యాపారుల కోసం పనిచేస్తాం. ఇదే వాళ్లకు, మాకు మధ్య ఉన్న వ్యత్యాసం' అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సీఎం భూపేశ్ బఘేల్ కూడా వేదికపైగా ఉండటం గమనార్హం. రాహుల్ వ్యాఖ్యలతో సీఎంతోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు.

కాగా, రాహుల్ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 'అదానీ కోసం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ పనిచేస్తారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఎట్టకేలకు ఆయన నిజాన్ని అంగీకరించారు. అదానీకి మేలు చేసింది, పెంచి పోషించింది కాంగ్రెస్ అని స్పష్టమైంది' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+