ఆ చట్టం ముస్లీంలకూ వర్తిస్తుంది: హైకోర్టు
అహ్మదాబాద్: హిందూ, ముస్లీంతో పాటు ఇతర మతాల వారికి బాల్య వివాహ నిరోధక చట్టం వర్తిస్తుందని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ముస్లిం మతాల వ్యక్తి గత చట్టాలను బాల్య వివాహ నిరోధక చట్టాలతో ఎలా పోల్చుతారని ప్రశ్నించింది.
గుజరాత్ కు చెందిన యూసఫ్ షేక్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్టు న్యాయమూర్తి జే.బి. పర్దివాల విచారణ చేశారు. ముస్లీం, హిందూతో పాటు ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను సైతం తోసి పుచ్చుతుందని గుర్తు చేశారు.
మతాల పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందని చెప్పారు. దీంతో పాటు మార్పులు, చేర్పులకు అనుమతించని ముస్లీం పర్సనల్ లా చట్టం వలన ముస్లీంలకు తీరని నష్టం జరుగుతున్నదని వ్యాఖ్యానించారు.

యూసఫ్ షేక్ అనే వ్యక్తి గుజరాత్ లో 16 సంవత్సరాల బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతని మీద కేసు నమోదు అయ్యింది. తాను ముస్లీంననీ, ముస్లీం పర్సనల్ లా ప్రకారం తాను వివాహం చేసుకున్నానని, తనకు బాల్య వివాహ నిరోధక చట్టం వర్తించదని అన్నాడు.
ఇదే విషంపై అతను హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని వాదనలను విన్న హైకోర్టు పై విధంగా స్పందించింది. బాల్య వివాహ నిరోధక చట్టం అందరికి వర్తిస్తుందని, యూసఫ్ షేక్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications