viral video: 'మేం చైనీయులం కాదు.. భారతీయులం'.. అరుణాచల్ ప్రదేశ్ చిన్నారి ఎమోషనల్ వీడియో..
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా భారత్ భూభాగంలోనే ఉంది. కానీ చైనా మాత్రం ఈ ప్రాంతం తమదే అంటూ ఏళ్లుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ వస్తోంది. ఇక చైనా ఈ ప్రాంతాన్ని జాంగ్ వాన్ అని పిలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా స్వయంగా కొత్త పేర్లు పెడుతూ వివాదాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ చిన్నారికి సంబంధించిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తనను చైనీస్ అని పిలవడంపై చిన్నారి అసంతృప్తి చెందింది. 'మేం చైనీయులం కాదు.. భారతీయులం' అంటూ వీడియో పోస్టు చేసింది. ఈ నాలుగేళ్ల చిన్నారి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ నాలుగేళ్ల చిన్నారి ఎమోషనల్ వీడియో.. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న జాతి వివక్షపై మరోసారి చర్చకు తెరలేపింది. ఈ వైరల్ వీడియో ఓ వ్యక్తి ఆ చిన్నారిని 'నువ్వు చైనీస్ వా..?' అని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ చిన్నారి ఏమాత్రం తడబడకుండా 'మేం ఇండియన్స్.. చైనీస్ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది.. బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవండి. మేం ఇటానగర్ లో ఉంటాం' అంటూ ఎమోషనల్ అయింది.
A child from #Itanagar #ArunachalPradesh voiced her frustration over people from the Northeast being stereotyped as Chinese. She says, "We are Indians, don’t call us Chinese."#NortheastIndia #StopRacism #UnityInDiversity pic.twitter.com/vgGbCxg6de
— Chandrakant (@shindeckant) August 20, 2026
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. చిన్నారి మాటలను పలువురు ప్రశంసిస్తున్నారు. 'చిన్ని యువరాణి.. నువ్వు ఎప్పటికీ భారతీయురాలివే. అందుకోసం నువ్వు ఎవరికి ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. లవ్ యూ రా చిట్టితల్లి.. నీ దేశభక్తి సూపర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియోను బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ట్యాగ్ చేశారు. చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. " మై డాన్సింగ్ లిటిల్ గర్ల్.. యూ ఆర్ ఇండియా.. నువ్ ప్యూర్ సౌల్.. జై హింద్.. జై మణిపూర్" అని కామెంట్ పెట్టారు. ఇక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని చైనీస్, నేపాలీ లేదా ఇతర దేశాలకు చెందినవారిగా పోల్చడం ఇప్పటికీ కనిపిస్తోందని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications